Vijayawada News : పచ్చళ్ల పేరుతో కొరియర్ లో విదేశాలకు డ్రగ్స్, తిరిగొచ్చిన పార్శిల్ క్లూ ఇచ్చింది
Vijayawada News : విజయవాడలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. ఓ కొరియర్ సంస్థ నుంచి విదేశాలకు డ్రగ్స్ పంపించారని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుడి కోసం అధికారులు గాలిస్తున్నారు.
Vijayawada News : విజయవాడ మీదగా ఇతర దేశాలకు నిషేధిత డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు కస్టమ్స్ అధికారులు. హైదరాబాద్ కేంద్రంగా వివిధ రాష్ట్రాల్లో డీఎస్టీ ఇంటర్నేషనల్ కొరియర్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కొరియర్ ద్వారా ఇతర దేశాలకు వివిధ వస్తువులను కొరియర్ చేస్తారు. అయితే గుంటూరు జిల్లా సత్తెనపల్లి చెందిన గోపి సాయి జనవరి 31వ తారీఖున నాలుగు కేజీల పచ్చళ్ళు ఆస్ట్రేలియా పంపాలంటూ కొరియర్స్ వద్దకు వచ్చాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు నెంబర్ సరిగ్గా కనపడక పోవటంతో కొరియర్ లో పనిచేస్తున్న తేజ అనే వ్యక్తి ఆధార్ కార్డు జోడించి కొరియర్ పంపించేశాడు. అడ్రస్ సరిగా లేకపోవడంతో కొరియర్ ఆస్ట్రేలియా వెళ్లకుండా కెనడా వెళ్లింది. అక్కడ నుంచి మళ్లీ కొరియర్ హైదరాబాద్ తిరిగి వచ్చింది. అక్కడ నుంచి బెంగళూరు కొరియర్ వెళ్లింది. దీని పై అనుమానం వచ్చినా బెంగళూరు కస్టమ్స్ అధికారులు కొరియర్ ఓపెన్ చేసి చూడగా నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఏ అడ్రస్ నుంచి వచ్చింది. ఎవరి దీన్ని పంపారు అనే కోణంలో విచారించగా విజయవాడ కేంద్రంగా ఇదంతా జరిగినట్లు గుర్తించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొరియర్ బాయ్ తేజను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పచ్చళ్ల పేరుతో డ్రగ్స్
ఈ కేసుకు సంబంధించి కొరియర్ బాయ్ తేజను ఏప్రిల్ 27న బెంగళూరు పిలిపించిన కస్టమ్స్ అధికారులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా కొరియర్ కార్యాలయంలో సాయిగోపి ఇచ్చిన ఆధార్ కార్డు నకిలీదని అధికారులు గుర్తించారు. పార్శిల్‌లో పిరిడిన్ అనే నిషేధిత డ్రగ్స్ ను ఉన్నాయని తేలింది. బెంగళూరు కస్టమ్స్ అధికారులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. లోకల్ పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పడి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరు సత్తెనపల్లి, మరో బృందం బెంగళూరు ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారుల వద్దకు వెళ్లారు. సాయిగోపి ఇటీవలే రెండు సార్లు పచ్చళ్ల పార్శిల్స్ పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో నిజంగా పచ్చళ్లు పంపాడా, లేక డ్రగ్స్ పంపాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. తరచూ విజయవాడకు డ్రగ్స్ దందాకు లింక్ ఉండడం కలకలం రేపుతోంది.
Also Read : Shamshabad Drugs : కడుపులో 79 కొకైన్ క్యాప్యూల్స్, వీడొక్కడే మూవీ సీన్ రిపీట్