Vijayawada News : టైం పాస్ ప్రేమతో పిచ్చివాడినయ్యా, విజయవాడలో బీటెక్ విద్యార్థి సూసైడ్!
Vijayawada News : విజయవాడలో బీటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. టైమ్ పాస్ ప్రేమతో ఓ యువతి తనను మోసం చేసిందని అతడు సూసైడ్ నోట్ రాశాడు.
Vijayawada News : విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రేమించి మోసపోయానని సూసైడ్ లెటర్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ సలామ్ సూసైడ్ లెటర్ లో ఇలా రాశాడు. ఓ యువతి ప్రేమించి వంచిందని వాపోయాడు. తనను ప్రేమించిన యువతి ప్రవర్తనలో కొంతకాలంగా మార్పు వచ్చిందని తీరా ఆరా తీస్తే పెళ్లైన వ్యక్తితో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ రిలేషన్ లో ఉందని తెలిసిందన్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని సలామ్ తెలిపాడు. ఆ యువతి ప్రవర్తన మారుతుందని ఎంత ప్రయత్నించినా మారడంలేదని, దీంతో తాను సరిగా చదవలేకపోతున్నానని రాశాడు. అన్నీ వదిలేయమని చెప్పినా వినకుండా అర్థరాత్రుళ్లు మరో వ్యక్తితో వీడియో కాల్స్ మాట్లాడుతుందని సలామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ టైమ్ పాస్ ప్రేమతో తనను పిచ్చివాడ్ని చేసిందన్నాడు. అందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని సలామ్ లెటర్ లో రాశాడు. తనలాంటి మోసపోయిన అబ్బాయిలకు న్యాయం చేయాలని సలామ్ వేడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టైమ్ పాస్ ప్రేమతో
విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని సూసైడ్ నోట్ లో సలామ్ రాశాడు. యువతి టైమ్ పాస్ ప్రేమతో తాను పిచ్చోడిని అయ్యానని, జీవితం మీద విరక్తితో తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నానని వాపోయాడు. సుకుమిక తనపై ఫేక్ ప్రేమ నటించిందని, పెళ్లైన ఓ లెక్చరర్‌తో సంబంధం పెట్టుకుని న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేదని తెలిపారు. అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరని సలామ్ లేఖలో రాశాడు. సుకుమిక చేతిలో మోసపోయిన తనలాంటి అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ సలామ్ లేఖలో కోరారు.
యూపీని వణికిస్తున్న సీరియల్ కిల్లర్
యూపీలోని బరబంకి ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. మహిళలనే టార్గెట్ చేస్తూ హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ అక్కడే తిరుగుతున్నాడని తెలిసి భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఆరు పోలీస్ బృందాలు కిల్లర్ కోసం గాలిస్తున్నాయి. సోషల్ మీడియాలో నిందితుడి ఫోటో షేర్ చేశారు. గుర్తించిన వారెవరైనా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు చెప్పారు. ఇప్పటికే ముగ్గురు మహిళలను దారుణంగా చంపేశాడు నిందితుడు. గతేడాది డిసెంబర్ 5న అయోధ్య జిల్లాలో ఖుషేటి గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఏదో పని మీద బయటకు వచ్చింది. సాయంత్రం మళ్లీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు పెట్టారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు...డిసెంబర్ 6న ఓ చోట ఆమె మృతదేహం కనిపించింది. శరీరంపై బట్టలు లేవని, ముఖంపై తీవ్రంగా గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అయితే...ఆ మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఆ తరవాత కొద్ది రోజులకే...బరబంకిలో మరో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈమెను కూడా అత్యాచారం చేసిన చంపినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడించింది. డిసెంబర్ 30న తతర్హా గ్రామంలో 55 ఏళ్ల మహిళనూ ఇదే విధంగా హత్య చేశాడు సీరియల్ కిల్లర్. ఈ కేసుని విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్‌ను తొలగించి...మరో అధికారిని నియమించారు. బరబంకి ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు.