Uttarkashi Bus Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం, లోయలోకి దూసుకెళ్లిన బస్సు, 22 మంది మృతి
Uttarkashi Bus Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరకాశీలోని దుమ్టా లోయలో బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ఉన్నారు.
Uttarkashi Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లా దుమ్టాలో ఓ బస్సు లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 28 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాయపడిన 6 మందిని ఆసుపత్రికి తరలించారు. బస్సులో 28 మంది ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ ఏఎన్‌ఐకి తెలిపారు. ఇప్పటి వరకు 22 మృతదేహాలను వెలికి తీయగా, గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.
#UPDATE | As per Uttarakhand local administration, 22 pilgrims have died & 6 people have been injured. NDRF team rushing to spot and will reach any moment: MoS Home Nityanand Rai to ANI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022
Uttarakhand | A bus carrying 28 pilgrims from Panna district in Madhya Pradesh fell into a gorge near Damta in Uttarkashi district. Bodies of 6 people recovered while 6 injured have been sent to the hospital. Police & SDRF on the spot: DGP Ashok Kumar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022
#WATCH | Uttarakhand: Visuals from the gorge in Uttarkashi district where a bus carrying 28 pilgrims fell down. 22 pilgrims have died & 6 people have been injured. Local administration & SDRF teams engaged in rescue work; NDRF team rushing to spot. pic.twitter.com/g0KDBRdDMe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022
దుమ్టాలో యమునోత్రి జాతీయ రహదారిలో 28 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6 గురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల ఘటనా ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యాత్రికులు యమునోత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Uttarakhand | CM Pushkar Singh Dhami reached Disaster Control Room in Dehradun pertaining to a bus accident in Uttarkashi dist. He directed the district administration to carry out relief & rescue work expeditiously along with proper treatment of the injured: CMO pic.twitter.com/IkRro1dHxC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
బస్సు లోయలో పడిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు సరైన వైద్యంతో పాటు మృతదేహాలను రాష్ట్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తరకాశీలో బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the accident in Uttarakhand. The injured would be given Rs. 50,000 each.
— PMO India (@PMOIndia) June 5, 2022