అన్వేషించండి

అమెరికాలోని ఓ జిమ్‌లో ఇండియన్‌పై దాడి, కత్తితో పొడిచిన నిందితుడు - పరిస్థితి విషమం

US Crime News: అమెరికాలోని ఓ జిమ్‌లో 24 ఏళ్ల ఇండియన్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

US Crime News: 

24 ఏళ్ల యువకుడిపై దాడి..

అమెరికాలోని ఇండియానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భారత్‌కి చెందిన ఓ 24 ఏళ్ల విద్యార్థి జిమ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కత్తితో పొడిచాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. బతికే అవకాశాలు చాలా తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. బాధితుడి పేరు వరుణ్‌గా వెల్లడించారు పోలీసులు. ఇండియానాలో ఓ పబ్లిక్‌ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా ఈ దాడి జరిగినట్టు వివరించారు. అయితే...ఈ దాడికి కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

"వరుణ్‌ ఇండియానాలోని ఓ పబ్లిక్ జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి దాడి చేశాడు. కత్తితో దారుణంగా పొడిచాడు. స్థానికులు గుర్తించి వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లోతైన గాయాలయ్యాయి. బతికే అవకాశాలు 5% మే అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బాధితుడి పరిస్థితి విషమంగానే ఉంది"

- పోలీసులు

నిందితుడు చెప్పిందిదే..

నిందితుడు జోర్డాన్ అండ్రాడ్ ఘటన ఎలా జరిగింది పోలీసులకు వివరించాడు. మసాజ్‌ కోసం అక్కడికి వెళ్లానని, వరుణ్‌ తనపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని చెప్పాడు. తనను తాను రక్షించుకోవడం కోసమే కత్తితో దాడి చేశానని అన్నాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి మసాజ్‌ చైర్‌పై బాధితుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తలకు తీవ్ర గాయమైంది. అదే రూమ్‌లో నుంచి ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కత్తి నిందితుడిదేనని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget