UP Shocker: మొగుడు కాదు కిరాతకుడు- భార్యను పందెంగా పెట్టి భర్త జూదం - 3 నెలల పాటు 8 మంది అత్యాచారం !
UP husband: యూపీలో ఓ భర్త తన భార్యను పందెంగా పెట్టి జూదం ఆడాడు. ఓడిపోవడంతో మూడు నెలల పాటు ఎనిమిది మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
UP husband gambled his wife on a bet: కట్టుకున్న భార్యను ఎవరైనా కన్నెత్తి చూసినా సహించలేని మనస్థత్వం మగాళ్లుక ఉంటుంది. కానీ కొంత మంది ఘోరమైన వ్యక్తులు ఉంటారు. కట్టుకున్న భార్యను ఇతరులు శారీరకంగా అనుభవించడానికి ఇచ్చేస్తూంటారు. అలాంటి ఘోరమైన భర్త.. యూపీలోని ఓ యువతికి రావడంతో ఆమె జీవితం బుగ్గిపాలైంది.
యూపీలోని బరేలీ జిల్లాలో ఘోరం
ఉత్తరప్రదేశ్‌లోని అగ్రా జిల్లా బరెల్లీ గ్రామంలో ఓ యువతి భర్త జూదం ఆడి ఓడిపోయి, రుణం తీర్చుకోవడానికి భార్యనే పందెంగా పెట్టాడు. ఆ తర్వాత ఎనిమిది మంది వ్యక్తులు ఆమెపై మూడు నెలల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భం దాల్చగానే బలవంతంగా గర్భస్రావం చేయించారు.
మూడు నెలల తర్వాత తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు
30 ఏళ్ల యువతి సోమవారం అగ్రా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. తన భర్త పేరు రాజ్‌కుమార్ (35) అని, గత కొన్ని నెలలుగా జూదానికి బానిస అయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది. ఆగస్టులో తన స్నేహితులతో జరిగిన జూదంలో రూ.50 వేలు ఓడిపోయి, ఆ డబ్బు తీర్చలేక తనను జూదం బల్లపై పెట్టాడని ఆమె తెలిపింది. ఆ రోజు నుంచి ఎనిమిది మంది ఆమెను ఇష్టం లేకుండా అత్యాచారం చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది.
మూడు నెలల పాటు చిత్రహింసలు భరించిన యువతి
ఈ దారుణం మూడు నెలలు కొనసాగింది. ఆమె గర్భం దాల్చింది. విషయం తెలిసిన వెంటనే ఆ ఎనిమిది మంది ఆమెను ఒక చిన్న క్లినిక్‌కు తీసుకెళ్లి బలవంతంగా గర్భస్రావం చేయించారు. ఆ సమయంలోనూ కొట్టారు, బెదిరించారు. అన్నీ భరించలేక ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్, బలవంతపు గర్భస్రావం తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు.
పరారీలో భర్త - ఆరుగురు రేపిస్టుల అరెస్టు
పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిలో ఆరుగురిని అరెస్టు చేశారు. భర్తతో సహా మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు. యువతిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటన బయటకు రాగానే గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మహిళా సంఘాలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపాయి. పోలీసు అధికారులు “కేసును తీవ్రంగా తీసుకున్నాం. త్వరలోనే మిగతా వాళ్లను పట్టుకుంటాం” అని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన యూపీలో సంచలనం సృష్టించింది. భార్యలను జీవిత భాగస్వాములుగా చూడకుండా.. వారిని శారీరక అవసరాలు తీర్చుకునే వస్తువుగానే చూస్తున్న వారు ఉండటం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. భర్తతో పాటు ఆమెపై అత్యాచారం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.





















