Crime : ఇజ్రాయెల్ మెషిన్‌తో వయసు తగ్గిస్తామని చెబితే నమ్మేశారు - ఈ జంట రూ. 35 కోట్లు కొట్టేసింది !
Age reversal: ఇజ్రాయెల్ నుంచి ఓ టైమ్ మెషిన్ తెచ్చామని దాంతో వయసు తగ్గిస్తామని చెబితే నమ్మేశారు అమాయక జనం. రూ. 35 కోట్లు సమర్పించేసుకున్నారు. యూపీ జంట వీరందర్ని మోసం చేసింది.
UP couple promise age reversal with Israeli time machine : చందమామ మీద ప్లాట్లు అమ్ముతామని నమ్మితే డబ్బులు కట్టేసి రిజిస్ట్రేషన్ చేయిచుకునేవాళ్లు ఉన్న ఈ లోకంలో వయసు తగ్గిస్తామని టైమ్ మెషీన్‌లో వెనక్కి పంపిస్తామని చెబితే నమ్మవాళ్లు ఉండరా ?. ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్లందర్నీ వెదికి పట్టుకుని రూ. 35కోట్లు వసూలు చేసి పరారయ్యారో జంట. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
కాన్పూర్‌లో రాజీవ్ దూబే, రష్మి అనే జంట నివాసం ఉంటుంది. చూడటానికి కాస్త హైఫైగా కనిపించే వారు తమ వయసు తక్కువగా కనిపించడానికి ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన ఓ మెషిన్ ను ఉపయోగిస్తూ ఉంటామని చెప్పేవారు. ఆక్సీజన్ ధెరపీ ద్వారా శరీరంలో ఉన్న పొల్యూషన్ ను బయటకు పంపితే శరీరం ఆటోమేటిక్ గా టైమ్ మెషిన్ ద్వారా వెనక్కి వెళ్లిపోతుందని అలా పాతికేళ్ల వరకూ వయసు తగ్గించుకోవచ్చని నమ్మబలికారు.
ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచ్‌నే పెట్టేశారు - కానీ ఇలా దొరికిపోయారు !
రివైవల్ వరల్డ్ పేరతో తాము చేయాలనుకున్న మోసం కోసం ఓ దుకాణం కూడా తెరిచారు. మసాజ్ లాంటి ఓ మెషిన్ పెట్టుకున్నారు. అరు వేల నుంచి 90వేల రూపాయల వరకూ అనేక ప్యాకేజీలు ఆఫర్ చేశారు. అంతే కాదు.. ఇలా వయసు తగ్గించుకునేందుకు సబ్ స్క్రయిబర్లను తీసుకు వస్తే కమిషన్ కూడా కొత్త కస్టమర్లకు ఆఫర్ చేశారు. అలా ఓ చెయిన్ సిస్టమ్‌లా .. అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. మేజిక్ మెషిన్లను ఇజ్రాయెల్ నుుంచి తెప్పించి ఇస్తామని కూడా కొంత మది దగ్గర డబ్బులు వసూలు చేశారు.
ఇలా మొత్తంగా రూ. 35 కోట్లు సమర్పించుకునే వరకూ అసలు నిజం వారికి తెలియలేదు. చివరికి మోసపోయామని గుర్తించిన వ్యక్తి ఈ జంట మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే వచ్చిన డబ్బును మూట గట్టుకుని వారు కనిపించకుండా పోయారు. వారి కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశం దాటి వెళ్లకుండా చేసి అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
గుడి ముందు సెల్ఫీ దిగారంటే చోరీకి స్కెచ్ వేసినట్టే- గూగుల్‌లో ఫేమస్ టెంపుల్సే వాళ్ల టార్గెట్
అయితే ఇలాంటి వాళ్లు మోసం చేసినా.. ఇలాంటి వారు చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మేసి డబ్బులు కట్టేవాళ్లతే అసలు తప్పని చెప్పుకోవచ్చు. వయసు తగ్గించే మెషిన్ వచ్చిందంటే నమ్మడం ఏమిటని.. కాస్త చదువుకున్న వారు కాకపోయినా.. లోకజ్ఞానం తెలిసిన ఎవరైనా వాళ్లు మోసం చేస్తున్నారని సులువుగా అర్థం చేసుకుంటారని అంటున్నారు . ఇలాంటి నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.