అన్వేషించండి

Srikakulam: గుడి ముందు సెల్ఫీ దిగారంటే చోరీకి స్కెచ్ వేసినట్టే- గూగుల్‌లో ఫేమస్ టెంపుల్సే వాళ్ల టార్గెట్‌

Srikakulam: మూడేళ్లుగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నాడు. వాళ్ల చోరీ విధానం తెలుసుకున్న పోలీసులే షాక్ తిన్నారు.

Crime News: గత మూడేళ్లుగా లగ్జరీకి అలవాటై దొంగతనాల్ని చేసుకుంటున్నారు. అందరూ 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలులోపు యువకులే. ఇవేవో నార్మల్‌గా చేసిన చోరీలు కావు. ముందుగా ఫేమస్ టెంపుల్స్‌ గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. అక్కడకు వెళ్తారు. దేవాలయాల్లో సిసి కెమెరాలు ఎలా ఆఫ్ చేయాలో కూడా తెలుసుకుంటారు. మూడేళ్లుగా ఇదే దందా నడిపించారు. చివరకు పోలీసులకు చిక్కారు. 

శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలు పాల్పడ్డారు. దొంగతనం చేయడానికి పది రోజులు ముందు ఆ దేవాలయంలో రెక్కీ వేస్తారు. అక్కడ తిరుగుతూ సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటారు. రూట్ మ్యాప్ తయారు చేసుకుంటారు. అన్ని సెట్ అయిన తర్వాత ఒకరోజు ప్లాన్ చేసుకుంటారు. ఆ గ్రామానికి వెళ్లి అక్కడ గ్రామస్తులతో ఈ దేవాలయం చరిత్ర ఫస్ట్ తెలుసుకుంటారు. ఏ రోజు భక్తులు ఎక్కువగా వస్తారో తెలుసుకుంటారు. ఆదాయం గురించి ఆరా తీస్తారు. 

Srikakulam: గుడి ముందు సెల్ఫీ దిగారంటే చోరీకి స్కెచ్ వేసినట్టే- గూగుల్‌లో ఫేమస్ టెంపుల్సే వాళ్ల టార్గెట్‌

ఒకట్రెండు కాదు ఏకంగా మూడేళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న చోరీ గ్యాంగ్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 2021 నుంచి పలు ప్రాంతాల్లో ఇళ్లు, దేవాలయాల్లో చోరీ చేస్తోందీ గ్యాంగ్. వారిని అరెస్టు చేసిన బంగారం నగలు, దేవుడు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి 692 గ్రాముల బంగారం, 52 కేజీల 880గ్రాముల వెండి ఆభరణాలు సహా 3లక్షల 38వేల నగదు, 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 31 దేవాలయాలతోపాటు 4 గృహాల్లో, ఒక రైస్ మిల్లుల్లోనూ చోరీకి పాల్పడ్డారు. 

2021 నుంచి పలు దేవాలయాల్లో జరుగుతున్న నేరాలకు సంబంధించి డీఎస్పీ సి.హెచ్. వివేకానంద పర్యవేక్షణలో ఎనిమిది మందితో కలిసి ఒక బృందం ఏర్పాటైంది. వివిధ సాంకేతిక పరిజ్ఞానం, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. విశాఖపట్నం, కోనసీమ జిల్లాలతోపాటు తెలంగాణాలో సైతం ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటలో శ్రీ రాజరాజేశ్వరి శక్తి పీఠంలో చోరీకి పాల్పడ్డారు. 

Srikakulam: గుడి ముందు సెల్ఫీ దిగారంటే చోరీకి స్కెచ్ వేసినట్టే- గూగుల్‌లో ఫేమస్ టెంపుల్సే వాళ్ల టార్గెట్‌

ఈ చోరీల్లో మొత్తం 9 మంది ఉండగా వీరిలో ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. సీతంపేట, ఎల్.ఎన్.పేట, హిరమండలంతోపాటు మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈ గ్యాంగ్‌లో ఉన్నారు. సీసీ కెమెరాలు లేని దేవాలయాలను ఎంపిక చేసుకొని దొంగతనాలకు పాల్పడతారు. ఒక వేళ సీసీ కెమెరాలు ఉంటే కట్టర్‌తోపాటు ఇతర పరికరాలు ఉపయోగించి చోరీలు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget