అన్వేషించండి

మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు

Ujjain Crime News: ఉజ్జెయిన్ బాలిక అత్యాచార ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Ujjain Crime News: 

ముగ్గురు అరెస్ట్..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌లో ఓ 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన సంచలనమైంది. ఆమె రోడ్డు మీద నడుచుకుంటూ సాయం కోసం వేడుకున్న విజువల్స్‌ షాక్‌కి గురి చేశాయి. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఓ ఆటోడ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. ఆ ఆటోలో రక్తపు మరకలు కనిపించడాన్ని చూసి ఆరా తీశారు. ఆ తరవాత అదుపులోకి తీసుకున్నారు. జీవన్ ఖేరి అనే ఓ ఏరియా వద్ద బాధితురాలు ఇదే ఆటోని ఎక్కినట్టు CC కెమెరాలో రికార్డ్ అయిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఫుటేజ్ ఆధారంగానే ఆటో డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. ఆ ఆటోలో రక్తపు మరకలు కనిపించాయి. వాటిని సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే...వీళ్ల వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. బాధితురాలు సాయం కోసం వీధుల్లో తిరిగిన ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరంలో CC కెమెరాలో ఆ బాధితురాలు ఆటో ఎక్కిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన తరవాతే మిగతా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 

పోలీసులకు కాల్ చేసిన పూజారి..

ఈ ఘటన జరిగిన రోజున ఉదయం 9.30 నిముషాల ప్రాంతంలో బాలికను ఆ దారుణ స్థితిలో చూసినట్టు ఆమెని కాపాడిన పూజారి వెల్లడించారు. ఆమె ఒంటినిండా రక్తం ఉందని, సరిగ్గా మాట్లాడలేకపోతోందని వివరించారు. 

"బాలికకు తీవ్ర రక్తస్రావం అవుతోంది. సరిగ్గా మాట్లాడలేకపోతోంది. కళ్లు ఉబ్బిపోయాయి. వెంటనే పోలీసులకు కాల్ చేశాను. ఆమె ఒంటి మీద ఓ టవల్ కప్పాను. ముందుగా  హెల్ప్‌లైన్‌కి కాల్ చేశాను. కానీ కలవలేదు. ఆ తరవాత దగ్గరి పోలీస్ స్టేషన్‌కి కాల్  చేశాను. పరిస్థితి ఇలా ఉందని వివరించాను. 20 నిముషాల్లో పోలీసులు ఆశ్రమానికి వచ్చారు"

- బాలికను చూసిన పూజారి 

ఇదీ జరిగింది..

సామూహిక అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక రోడ్డుపై అర్ధనగ్నంగా నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు అక్కడి CC కెమెరాలో రికార్డ్ అవడం సంచలనమైంది. చాలా దారుణమైన స్థితిలో ఉన్న ఆ బాలిక రోడ్డుపై నడుచుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ సాయం కోసం అభ్యర్థించడం కలిచివేసింది. ఆమెను అలాంటి స్థితిలో చూసినా ఎవరూ సాయం చేయలేదు. ఓ వ్యక్తి ఆమెని చూసి కూడా పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్లిపోవడం CC కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియోలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఉజ్జెయిన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నాగర్ రోడ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. తన ఒంటిని కప్పుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోయింది. చివరకు ఓ ఆశ్రమం వద్దకు చేరుకుంది. ఆమెని చూసిన ఓ పూజారి వెంటనే ఆమె శరీరాన్ని కప్పాడు. ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు అత్యాచారం జరిగినట్టు ధ్రువీకరించారు. గాయాలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కి తరలించారు. అప్పటికే చాలా రక్తం పోయింది. పోలీసులే ముందుకొచ్చి ఆమెకి రక్తదానం చేశారు. 

Also Read: స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget