Tirupati Crime News : పోలీసులు పట్టుకుంటారేమోనని అడవిలోకి పారిపోయారు - మిస్సయ్యారు ! ఆ లవ్ స్టోరీలో ఇంకెన్ని ట్విస్టులో ...
పోలీసులను తప్పించుకునేందుకు ఇద్దరు యువకులు తిరుమల అడవిలోకి పారిపోయారు. ఇప్పుడు వారి ఆచూకీ తెలియడం లేదు.
Tirupati Crime News : అది అలిపిరి టోల్ గేట్. కొండపైకి వెళ్లే వాహనాలను సిబ్బంది తనిఖీ చేస్తూ ఉంటారు. ఇలా ఆగిన ఓ కారు నుంచి ఓ యువకులు దిగి పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలో ఉన్న టీటీడీ విజిలెన్స్ అధికారులతో తనను ఆ కారులోని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని ఫిర్యాదు చేశారు. దీంతో అలర్ట్ అయిన టీటీడీ విజిలెన్స్ ఆ కారు వద్దకు వస్తున్న సమయంలోనే రాంగ్‌రూట్‌లోకి పోనిచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కారును ఛేజ్ చేసి ఎలాగోలా పట్టుకున్నా.. అందులో ఉన్న ఇద్దరు తప్పించుకునేందుకు కారు దిగి శేషా చలం అడవిలోకి పారిపోయారు. వారి మాత్రం ఆచూకీ లేరు. ఇప్పటికే రెండు రోజులు దాటిపోయింది.
అసలేమయిందంటే ?
శ్రీవారి దర్శనార్ధం విచ్చేసే భక్తులతో అలిపిరి తనిఖీ కేంద్రం నిత్యం రద్దీగా ఉంటుంది.. వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో కారు దిగిన యువకుడు తనను కిడ్నాప్ చేసారంటూ టిటిడి విజిలెన్స్ సిబ్బందిని ఆశ్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.. ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం మరో ఇద్దరు వాహనంను టోల్ గేట్ లో ఆపకుండా ఘాట్ లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించారు.. దీంతో ఆ వాహనంను అలిపిరి టోల్ గేట్ సిబ్బంది మరోక వాహనంలో వెంబడించి లింక్ రోడ్డు సమీపంలో అడ్డుకున్నారు.. వాహనంను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకోవడంతో ఆ ఇద్దరు యువకులు ప్రక్కనే ఉన్న లోయలోకి దిగ్గారు.. ఆక్టోపస్ సిబ్బంది, పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఎంత వెతికినా ఆ ఇద్దరు ఆచూకీ మాత్రం లభించలేదు..అదుపులో ఉన్న ముగ్గరిని రేణిగుంట పొలీసులకు అప్పగించారు విజిలెన్స్ అధికారులు.
ప్రేమ పెళ్లి చేసుకున్న జంట మధ్యలో మహిళ కారణంగా వివాదం !
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాహుల్ చైతన్య, అదే ఊరికి చేందిన ప్రవల్లిక మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.. అయితే కొద్ది రోజుల వరకూ అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు.. వృత్తి రిత్యా రాహుల్ చైతన్య తిరుపతి జిల్లా, రేణిగుంటలోని గౌరినగర్‌లో నివాసం ఉంటున్నాడు.. రాహుల్ చైతన్య ,ప్రవల్లిక కుటుంబ సభ్యులు ఇద్దరికి సర్ధి చెప్పడంతో ప్రవల్లికను రేణిగుంటలీ కాపురం పెట్టేందుకు ఒప్పుకున్నాడు.. అప్పటి నుండి ప్రవల్లిక తన భర్త రాహుల్ చైతన్యతో ఫోన్లో సంభాషిస్తూ వచ్చేది.. ఈక్రమంలో వారం క్రితం రాహుల్ చైతన్య పుట్టిన రోజు రావడంతో ప్రవల్లిక తన భర్తకు సర్ప్రైజ్ చేసేందుకు రేణిగుంటకు వచ్చింది.
సర్‌ప్రైజ్ చేద్దామని వచ్చి వేరే మహిళతో భర్త సన్నిహితంగా ఉండటం చూసిన ప్రవల్లిక
ప్రవల్లిక వచ్చిన సమయంలో రాహుల్ చైతన్య మరోక మహిళతో సన్నిహితంగా ఉండడంను చూసిన ప్రవల్లిక తీవ్ర మనోవేదనకు గురై తిరిగి రాజమండ్రికి వెళ్ళి జరిగిన విషయంను కుటుంబ సభ్యులకు తెలియజేసింది.. ప్రవల్లిక అన్న తాను స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్తున్నాని, ఇదే విషయంను రాహుల్ తో మాట్లాడుతానని చెప్పి ఒదార్చాడు.. తిరుమల యాత్రకు స్నేహితులతో కలిసి బయలుదేరిన ప్రవల్లిక సోదరుడు రేణిగుంటకు చేరుకుని రాహుల్ చైతన్యకు ఫోన్ చేసిన తాను తిరుమలకు వెళ్తున్నానని తాను కూడా తనతో రావాలని కోరాడు. ఇలా వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉండటం గురించి ఎవరికీ తెలియదనుకున్న రాహుల్ చైతన్య కారు ఎక్కాడు. కానీ కారులో తన చెల్లి రేణిగుంటకు వచ్చిన సమయంలో మరోక మహిళతో ఉండడంను ప్రవల్లిక సోదరుడు రాహుల్ చైతన్యతో ప్రస్తావించాడు. దీంతో తనను కొడతారని భయపడిన రాహుల్ చైతన్య అలిపిరి టోల్ గేట్ చేరుకోవడంతో కారు దిగి తనను కిడ్నాప్ చేసారంటూ గెట్టి గెట్టిగా కేకలు వేస్తూ అక్కడే ఉన్న టిటిడి విజిలెన్స్ సిబ్బందిని ఆశ్రయించడంతో అసలు సీన్ ప్రారంభమయింది.
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు !
రాహుల్ చైతన్యను పట్టుకునేందుకు వచ్చిన లోకేష్ ,గణేష్, రాజేష్ లను టిటిడి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.. దీనిని గమనించిన కారు డ్రైవర్ వేంటనే కారును టోల్ గేట్ లో ఆపకుండా రెండోవ ఘాట్ రోడ్డులోకి పోనిచ్చాడు.. మరోక వ్యక్తి కూడా టోల్ గేట్ దాటి వాహనంను ఎక్కి ఘాట్ రోడ్డులో వేగంగా పోనిచ్చారు.. అయితే ఆ వాహనంను వేంబడించిన టిటిడి విజిలెన్స్, పోలీసులు రెండోవ ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు.. అయితే తమను ఎక్కడ అరెస్టు చేస్తారోనని భయపడిన ఆ ఇద్దరు యువకులు ప్రక్కనే ఉన్న లోయలోకి దిగి పరార్ అయ్యారు..
అడవిలో మిస్సయిన ఇద్దరు యువకులు
వీరిద్దరిని ఆక్టోపస్ దళాలతో బుధవారం రాత్రి నుండి గురువారం మధ్యాహ్నం వరకూ శేషాచలం అటవీ ప్రాంతంలో గాలించారు.. కానీ ఆ ఇద్దరి ఆచూకీ లబించక పోవడంతో అదుపులో ఉన్న ముగ్గరిని అలిపిరి పోలీసులకు అప్పగించారు.. ఈకేసులో ప్రవల్లిక ఇచ్చే సమాచారంను కీలకం కావడంతో ఆమెను అలిపిరి పోలీసులకు పిలిపించారు.. ఈ కేసు తమ పరిధి అయినప్పటికీ రేణిగుంట పోలిసులు దర్యాప్తు చేయాలని అలిపిరి పోలీసులు, అనడంతో రేణిగుంట పోలీసులు తమ పరిధి కాదని అంటున్నారు.. అదుపులో ఉన్న ముగ్గరిపై కేసు నమోదు చేయాలా వద్దా నే విషయంపై పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు..