అన్వేషించండి

Cat Bite: కృష్ణా జిల్లాలో విషాదం - పిల్లి కరవడంతో ఇద్దరు మహిళలు మృతి, అసలేం జరిగిందంటే !

Cat Bite in Krishna district: పిల్లి కరవడంతో మహిళలు చనిపోవడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Two Woman Dies With Cat Bite in Krishna district: కుక్క కాటుకు గురై మనుషులకు పిచ్చి పట్టడం గానీ, కొంత కాలానికి చనిపోవడం వింటుంటాం. కానీ పిల్లి కరవడంతో మహిళలు చనిపోవడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే పిల్లి కరిచిన తరువాత జాగ్రత్తలు తీసుకున్నా ఎందుకిలా జరిగిందని స్థానికంగానూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
పిల్లి కాటుకు గురైన ఇద్దరు మహిళలకు రేబిస్‌ వ్యాధి సోకడంతో ఇద్దరూ మృత్యువాతపడిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. 
కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం వేములమడ ఎస్సీ కాలనీలో రిటైర్డ్‌ ఆర్టీసీ కండక్టర్‌ సాలి భాగ్యారావు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య కమల (64)కు దాదాపు రెండు నెలల కిందట పిల్లి కరిచింది. అదే కాలనీలో ఆర్ఎంపీ డాక్టర్ బాబూరావు ఫ్యామిలీ నివాసం ఉంటోంది.  

కొన్ని రోజుల కిందట ఆర్ఎంపీ డాక్టర్ బాబూరావు భార్య నాగమణి సైతం పిల్లి కాటుకు గురయ్యారు. పిల్లి కరవడంతో కమల, నాగమణి వేర్వేరుగానే ఎలాంటి ఇన్‌ఫెక్షన్ అవ్వకుండా ఉండాలని టీటీ ఇంజెక్షన్‌ చేయించుకున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుని మందులు వాడారు. గత వారం వరకు వారిద్దరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కమల, నాగమణి నాలుగు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి మెరుగైన చికిత్స తీసుకున్నారు. అయినా ప్రయోజనం ప్రయోజనం లేకపోయింది. 

అసలు విషయం ఇదే..
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కమల చనిపోయింది. తొలుత మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకున్న నాగమణి, ఆపై వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమె సైతం చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. రేబిస్ వ్యాధి సోకడంతో ఇద్దరు మహిళలు చనిపోయారని డాక్టర్‌ శొంఠి శివరామకృష్ణారావు చెప్పారు. పిల్లి కాటు గురైన మొదట్లోనే సకాలంలో మెరుగైన వైద్య సేవలు తీసుకోకపోవడంతో ప్రాణ నష్టం సంభవించిందన్నారు. వీరిని కరిచిన పిల్లిని ఓ కుక్క కురవగా, ఆ కుక్క కొన్ని రోజుల కిందట చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Delhi High Court: ఆ కోడలికి అత్తవారింట్లో నివసించే హక్కు లేదు: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Also Read: NIA Searches: విరసం నేత పినాకపాణిని ఐదు గంటలకు పైగా విచారించిన ఎన్ఐఏ, సెల్ ఫోన్ సీజ్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Rishabh Pant Stunning Fifty: రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో పంత్ ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Rishabh Pant Stunning Fifty: రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో పంత్ ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఒక్కడే 'గేమ్ చేంజర్'... మరొక ముఖ్య అతిథి లేరు, ఇంకెవర్నీ పిలవలేదు
పవన్ కళ్యాణ్ ఒక్కడే 'గేమ్ చేంజర్'... మరొక ముఖ్య అతిథి లేరు, ఇంకెవర్నీ పిలవలేదు
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Embed widget