మద్యం మత్తులో కార్ రూఫ్‌పై పుషప్స్, హడలెత్తించిన మందు బాబులు - వైరల్ వీడియో
Drunk and Drive: మద్యం మత్తులో ఓ యువకుడు కార్ రూఫ్‌పై పుషప్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Drunk and Drive:
గుడ్‌గావ్‌లో ఘటన..
తప్పతాగి కార్లు, బైక్‌లు నడపకండి అంటూ పోలీసులు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కొందరి తీరు మారడం లేదు. పైగా...తాగడంతో ఆపకుండా రోడ్లపై పిచ్చి చేష్టలు చేస్తూ నానా రచ్చ సృష్టిస్తున్నారు. మిగతా వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. మధ్యరాత్రి ఈ అల్లర్లు మరీ ఎక్కువైపోతున్నాయి. గుడ్‌గావ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అర్ధరాత్రి యువకులు నానా హంగామా చేశారు. పీకలదాకా తాగడమే కాకుండా..కార్ రూఫ్‌పై పుషప్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ఆ యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.6,500 జరిమానా కూడా విధించారు. గుడ్‌గావ్‌లోని సైబర్ హబ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఆల్టో కార్ కిటికీలో నుంచి బయటకు వచ్చి మెల్లగా కార్ రూఫ్ ఎక్కాడు. ఆ తరవాత చేతిలో మందు సీసా పట్టుకుని తాగాడు. వెంటనే బాటిల్ పక్కన పెట్టి అక్కడే పుషప్స్ చేశాడు. మిగతా వాళ్లు కూడా తాగుతూ కనిపించారు. వెనకాల మరో కార్‌లో వస్తున్న వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వైరల్ అయ్యాక పోలీసులు అప్రమత్తమై కార్ నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...కార్‌లోని మిగతా వ్యక్తులనూ గాలిస్తున్నారు. ఆ కార్‌ని సీజ్ చేశారు. నిందితుడు..తన కజిన్ నుంచి లోన్ పెట్టి మరీ కార్ కొన్నాడు. ఇలా అడ్డదిడ్డంగా పార్టీ చేసుకుని బుక్ అయిపోయారు. మద్యం సేవించి ఇలా రోడ్లపై పిచ్చి వేషాలు వేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
गुरुग्राम में आपका स्वागत है , भारत चुनौतियों से नहीं इन लोगो से परेशान है 😨😰pic.twitter.com/LnHbT4uZJF
— Raja Babu (@GaurangBhardwa1) May 31, 2023
ఇటీవల ఢిల్లీలో ప్రమాదం..
ఢిల్లీలో ఇటీవలే ఓ BMW కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ఓ వ్యక్తిని ఢీకొట్టింది. బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెస్ట్ ఢిల్లీలోని మోతీబాఘ్లో ఈ ఘటన జరిగింది. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ కిరాణా షాప్ నడుపుకునే అజయ్ గుప్తా...షాప్ బంద్ చేసి వస్తుండగా కార్ వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కార్‌ని ఓ మహిళ నడుపుతోంది. ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ ఓ జనరేటర్‌ని ఢీకొట్టిన కార్..ఆ తరవాత నేరుగా అజయ్ గుప్తాపై దూసుకెళ్లింది. ఆమె ఓ పార్టీకి వెళ్లి వచ్చే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆమెను అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో తమకు యాక్సిడెంట్‌కి సంబంధించిన సమాచారం అందినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి అక్కడ రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమై ఉన్నట్టు చెప్పారు. అయితే...యాక్సిడెంట్ చేసిన ఆ అమ్మాయి అక్కడ కనిపించలేదు. బాధితుడి డెడ్‌బాడీ కూడా అక్కడ లేదు. అయితే...ఆ యువతి బాధితుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. అక్కడి నుంచి ESI హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు వచ్చే సమయానికి ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయాడు. అక్కడే స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Manipur Violence: బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం - మణిపూర్ అల్లర్లపై కేంద్రం కీలక ప్రకటన





















