Tirupati News: చిరుతను చూసి భయం - బైక్‌తో డివైడర్‌ను ఢీకొని టీటీడీ ఉద్యోగికి తీవ్ర గాయాలు
Andhra News: తిరుపతి అలిపిరి మార్గంలో చిరుత సంచారం ఆందోళన కలిగించింది. రోడ్డు దాటుతుండగా చిరుతను చూసిన వ్యక్తి ఆందోళనతో బైక్‌పై వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టాడు.

TTD Employee Injured In An Accident In Alipiri: తిరుపతి అలిపిరి (Alipiri) సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన టీటీడీ ఉద్యోగి భయంతో బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుమల (Tirumala) అశ్వనీ ఆస్పత్రిలో పనిచేస్తున్న విజయ్‌కుమార్ జూ పార్క్ రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా వేదిక్ యూనివర్సిటీ వైపు నుంచి చిరుత శేషాచలం అడవుల్లోకి వెళ్తుండడాన్ని చూసి భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో వేగంగా బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొని పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటువైపుగా వెళ్తున్న యువకుడు అధికారులకు సమాచారం అందించగా.. వారు ఆస్పత్రికి తరలించారు.
వేదిక్ యూనివర్సిటీతో (Vedik University) పాటు వెటర్నరీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత కదలికలను ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో అక్కడ బోను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నాారు. అయినా అటవీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా చిరుత పులి వేదిక్ యూనివర్సిటీ సమీపంలో అటవీ ప్రాంతంలో ఉందని నిర్థారణ కాగా.. అటవీ అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు, అటవీ అదికారులు పులి పాదముద్రలు పరిశీలించారు.





















