Kakinada Crime News: కాకినాడలో లేత దొంగ - బొమ్మ తుపాకీతో బెదిరించి తనిష్క్‌లో బంగారం కొట్టేశాడు కానీ ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు !
Kakinada: కాకినాడలో బొమ్మ తుపాకీతో బెదిరించి బంగారం దోచుకున్నాడో వ్యక్తి కానీ ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. యూట్యూబ్‌లు చూసి ఇలాంటి పనులు చేస్తున్నాడని అనుమానిస్తున్నారు.
Kakinada gold robbry: సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలి అని వీడియోలు చూశాడో.. లేకపోతే దొంగతనం కేంద్రంసాగే మనీ హెయిస్ట్ లాంటి వెబ్ సిరీస్‌లు చూశాడో కానీ ఓ వ్యక్తి ఏకంగా ఓ కార్పొరేట్ గోల్డ్ షోరూంనే టార్గెట్ చేశాడు. కానీ ప్రాపర్ గా వర్కవుట్ చేయకపోవడం.. దోచుకున్న వరకే ప్లాన్ రెడీ చేసుకోవడం.. ఆ ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియకపోవడంతో దొరికిపోయాడు. అది కూడా మామూలు పోలీసులకు కాదు.. ట్రాఫిక్ పోలీసులకు.
కాకినాడ మెయిన్ రోడ్‌లో తనిష్క్ బంగారు ఆభరణాల షోరూం ఉంది. మధ్యాహ్నం సమయంలో కస్టమర్లు ఎవరూ లేరు. ఆ సమయలో ఓ యువకుడు వచ్చాడు. తనకు లావుపాటి గోల్డ్ చైన్ కావాలని చూపించమని అడిగాడు. సేల్స్ గర్ల్ ఆరేడు మోడల్స్ చూపించింది. అన్నింటిని తన చేతుల్లోకి తీసుకున్న ఆ వ్యక్తి వెంటనే జేబులో నుంచి తుపాకీ తీసి.. కదిలితే కాల్చేస్తానని హెచ్చరించాడు.దాంతో వచ్చిన వాడు దొంగ అని తెలిసి ఆ సేల్స్ గర్ల్ వణికిపోయింది.
తర్వాత అతను ఆ నగలు తీసుకుని పరారయ్యాడు. చేతిలోతుపాకీ కూడా ఉండటంతో సెక్యూరిటీ కూడా ఆపలేదు. ఆ దొంగ అలా రోడ్డు మీదకు పరుగులు పెట్టిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే సిటీ బయటకు అనుమానాస్పద వ్యక్తులు వెళ్లకుండా తనిఖీలు చేయమని ఆదేశాలిచ్చి షోరూంను పరిశీలించేందుకు వచ్చారు.
Also Read: ఇది ఓ కొడుకు తీర్పు - లవర్‌కు ఫోన్ కొనివ్వడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య !
అయితే కాసేపటికే ఫారెస్ట్ ఆపీసు దగ్గర ఓ యువకుడ్ని పోలీసులు పట్టుకున్నారని అతని వద్ద చాలా బంగారు ఆభరణాలు ఉన్నాయని కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చింది. వెంటనే వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి తుపాకీ చూపించి గోల్డ్ కొట్టేసి బయటకు వచ్చాడు కానీ.. ఎటు పోవాలో అర్థం కాలేదు. ఫారెస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూండటంతో ఏమైందని ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రశ్నించాడు. అప్పటికే దొంగతనం చేశానన్న ఆందోళనతో.. ్ందరూ తననే వెంటాడుతున్నారన్న భయంతో వణికిపోతున్న ఆ యువకుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. తేడాగా ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని పట్టుకున్నాడు.
అతని జేబుల్లో వెదికితే బంగారం లభించింది. వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న గన్ స్వాధీనం చేసుకున్నారు. అది నిజమైన గన్ కాదని.. టాయ్ గన్ అని తేలింది. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అతను ప్రొఫెషనల్ దొంగ కాదని.. అలా అయితే.. పకడ్బందీగా దోపిడీ చేసి పారిపోయేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుని ఉండేవాడని పోలీసులు భావిస్తున్నారు.