News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tollywood Drugs Case: సినీ భాషలో డ్రగ్స్ దందా, పెడ్లర్ ను రైటర్ అని, డ్రగ్స్ కావాలంటే ‘షల్ వీ మీట్’ అంటూ కోడ్స్

Tollywood Drugs Case: సినీ భాషలో మాట్లాడుకుంటూనే డ్రగ్స్ దందా సాగినట్లు పోలీసులు గుర్తించారు. పెడ్లర్ ను రైటర్ అని, డ్రగ్స్ కావాలంటే షల్ వీ మీట్ అంటూ కోడ్స్ పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.  

FOLLOW US: 
Share:

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారు మాదక ద్రవ్యాల దందాను సినీ భాషలో కోడ్ వర్డ్స్ గా వాడుకుంటున్నట్లు పోలీసులు తేల్చారు. మరోపక్క టీఎస్ నాబ్ అధికారులు సినీ నటుడు నవదీప్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ ను పరిశీలిస్తున్నారు. న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ పొందిన నిందితులు మంగళవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ తో లింకులు ఉన్న డ్రగ్స్ కేసులు రెండు నమోదు అయ్యాయి. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న కేపీ రెడ్డికి సంబంధించిన కేసు మాదాపూర్ ఠాణాలో నమోదు అయింది. అలాగే వెంకట రమణారెడ్డి లింకులకు సంబంధించిన కేసు హైదరాబాద్ కమిషనరేట్ లోని గుడి మల్కాపూర్ ఠాణాలో రిజిస్టర్ అయింది. ఈ కేసులో హీరో నవదీప్ పేరు బయట పడింది. 

డ్రగ్స్ అంటే స్క్రిప్టు, పెడ్లర్ అంటే రైటర్, కావాలంటే షల్ వీ మీట్

ఈ రెండు కేసుల్లోనే అనేక మంది నటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు మోడల్స్ సైతం డ్రగ్స్ వినియోగదారులు ఉన్నట్లు బయటపడింది. వీళ్లు రహస్య ప్రాంతాల్లో పొరుగు రాష్ట్రాల్లో పార్టీలు నిర్వహించుకుంటూ మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారమంగా డ్రగ్స్ క్రయవిక్రయాల్లో వాటి పేర్లను డైరెక్టుగా వాడరు. ఎవరికీ వాళ్లు కొన్ని కోడ్ వర్డ్స్ పెట్టుకుని పని పూర్తి చేస్తుంటారు. ఈక్రమంలోనే సినీ రంగానికి చెందిన వారు సినీ కోడ్ లోనే మాట్లాడుకుంటూ క్రయవిక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా డ్రగ్ కు స్క్రిప్టు అని, పెడ్లర్ కు రైటర్ అని, డ్రగ్స్ కావాలని అడగడానికి షల్ వీ మీట్ అని కోడ్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. సినీరంగానికి సంబంధించిన వారి ఫోన్లను పరిశీలించినప్పుడు ఈ పదాలే ఎక్కువగా కనిపించాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. 

అలాగే మరోవైపు నవదీప్ నుంచి పోలీసులు ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ ను పోలీసులకు అప్పగించే ముందే నవదీప్ ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే దర్యాప్తులో గుర్తించిన అంశాలను బట్టి ఈ డ్రగ్స్ క్రయవిక్రయాలన్నీ స్నాప్ చాట్ ఆధారంగా జరిగినట్లు తెలుసుకున్నారు. ఈ సామాజిక మాధ్యమాల యాప్ లో ఉన్న డిజ్ అప్పీర్ ఆప్షన్ ను పెడ్లర్లు, వినియోగదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గుడిమల్కాపూర్ కేసులో నిందితులుగా ఉండి, న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్న వ్యాపారి కలహర్ రెడ్డి, పబ్ నిర్వాహకుడు సూర్య కాంత్ సహా మరో వ్యక్తి మంగళ వారం రోజు దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. గుడి మల్కాపూర్ ఠాణాలో ష్యూరిటీలు సమర్పించడంతో పాటు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు అవుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. తనకు డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పుకొచ్చారు. తర్వాత కూడా సహకరిస్తానని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని అన్నారు. 

Published at : 27 Sep 2023 01:24 PM (IST) Tags: Drugs Case tollywood drugs Telangana News Drugs Business in Code Language Cine Language in Drugs

ఇవి కూడా చూడండి

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే: విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి

Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే:  విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం