Tirupati Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - దైవ దర్శనానికి వెళుతూ నలుగురు దుర్మరణం
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం కల్వర్టును ఢీకొనడంతో నలుగురు భక్తుల దుర్మరణం చెందారు. కాణిపాకం వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
![Tirupati Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - దైవ దర్శనానికి వెళుతూ నలుగురు దుర్మరణం Tirupati Road Accident : 4 people dies in road accident in Tirupati District DNN Tirupati Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - దైవ దర్శనానికి వెళుతూ నలుగురు దుర్మరణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/4a5bfee80c2b54678fd9da9811cf065f1674643415626233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirupati Road Accident: తిరుపతి : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీ కొనడంతో ఘటనా స్ధలంలోనే నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం తిరుపతి - బెంగుళూరు జాతీయ రహదారిలోని కోనంగివారిపల్లె వద్ద తిరుపతి నుండి కాణిపాకంకు వెళ్తుండగా బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనదారుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు చంద్రగిరి పోలీసులు. క్షతగాత్రులను 108 సహాయంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు చంద్రగిరి పోలీసులు.
అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు మహారాష్ట్ర చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన మహారాష్ట్ర భక్తులు స్వామి వారి దర్శనంతరం కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనార్ధం తిరుపతి నుంచి కాణిపాకం క్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రుయా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తిరుపతికి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అందరు భక్తుల్లానే కాణిపాకం వినాకయకుడిని దర్శించుకోవాలనుకున్నారు. టవేరా వాహనం నెంబర్ ఎంహెచ్ 12 పీహెచ్ 9701 లో తిరుపతి నుంచి కాణిపాకం వెళ్తుండగా అదుపు తప్పిన వాహనం రోడ్ డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)