అన్వేషించండి

Tirupati News: ఎస్వీ యూనివర్శిటీలో క్షుద్ర పూజలు - విరూపాక్షను మించిన స్టోరీ, మామూలుగా లేదుగా!

Tirupati News: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. లైబ్రరీ సమీపంలో కోడిగుడ్లు, రక్తం, బొగ్గుపొడిని ఉపయోగించి పుర్రె గుర్తులతో ముగ్గులు ఉండడం చూసి అంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. 

Tirupati News: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపుతోంది. విరూపాక్ష సినిమా తరహాలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గత రెండు రోజుల క్రితం ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ భవనానికి కొంత దూరంలో ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో క్షుద్ర పూజలు జరిగాయి. ఈ పూజలకు ముగ్గు, బొగ్గు పొడి, ఉప్పుతో పుర్రె గుర్తుతో ముగ్గులు వేసి కోడి గుడ్లు, రక్తంతో పూజలు చేశారు. గత కొద్ది రోజులుగా యూనివర్శిటీ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి నెలకొనడంతో యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్ధినీ, విద్యార్ధులు భయాందోళనకు గురవుతున్నారు. అంతే కాకుండా రాత్రి సమయాల్లో యూనివర్శిటీ ప్రాంతాల్లో మద్యం సేవించి, వ్యర్ధాలను చెల్లాచెదురుగా పడేసి వెళ్తున్నారు. 

చర్యలు తీసుకోక పోతే ఉద్యమానికి సిద్దం..

ఎందరో మేధావుల విద్యను అభ్యసించిన ఎస్వీ యూనివర్శిటీలో.. సుదూర ప్రాంతాల‌ నుండి ఎంతో మంది పేద విద్యార్ధులు ఇక్కడకు వచ్చి విద్యను అభ్యసిస్తుంటారు. హాస్టల్లలో ఉంటూనే చదువుకుంటారు. ఎక్కువ మంది విద్యార్ధులు పగలు చెట్ల క్రింద చదువుకుంటూ ఉంటే, మరికొందరు లైబ్రరీకి వెళ్తుంటారు. ఇలా తరచూ లైబ్రరీకి, మైయిన్ బిల్డింగ్, క్యాంటీన్ వద్దకు విద్యార్ధులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యూనివర్శిటీ ప్రాంగణంలోకి ప్రవేశించి రాత్రి సమయాల్లో క్షుద్ర పూజలకు, అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉండడంతో అధ్యాపకులు, విద్యార్దులు భయాందోళనకు గురి అవుతున్నారు. దీనిపై ఎస్వీ యూనివర్శిటీ విద్యార్ధుల సంఘం నాయకులు స్పందిస్తూ.. క్షుద్రపూజలు ఎవరూ చెస్తున్నారో, ఎందుకు యూనివర్శిటీనే ఎంచుకున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. 

నిత్యం విద్యార్ధులు రాకపోకలు సాగించే నాలుగు రోడ్ల కూడలి వద్దనే క్షుద్ర పూజలు చేస్తున్నారని, ముఖ్యంగా యూనివర్శిటీ ఆవరణంలో సీసీ‌ కెమెరాలు లేకపోవడంతోనే గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని అన్నారు. అసాంఘీక కార్యకలాపాలు అడ్డాగా యూనివర్సిటీని మార్చుకుంటూ.. మద్యం సేవించడం వంటివి చేస్తున్నారని తెలిపారు. అయితే సెక్యూరిటీ సిబ్బింది ఎక్కువగా లేకపోవడం వంటి కారణాల వల్లే తరచూ ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఎస్వీ యూనివర్శిటీ ఉన్నతాధికారుల దృష్టికి క్షుద్ర పూజల వ్యవహారాన్ని విద్యార్థులు తీసుకు వెళ్లారని చెప్పారు. కానీ ఇంకా ఉన్నతాధికారులు స్పందించలేదని.. వెంటనే స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ గార్డుల సంఖ్యను పెంచాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్వీ యూనివర్శిటీ ‌ఉన్నతాధికారులు పట్టించుకోక పోతే విద్యార్ధులతో‌ కలిసి ఉద్యమం చేస్తామన్నారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget