News
News
X

Tirupati News : పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా వేధింపులు, కలెక్టరేట్ లో దంపతుల ఆత్మహత్యాయత్నం!

Tirupati News : తిరుపతి కలెక్టరేట్ లో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ భూమిని పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా వేధిస్తున్నారని భార్యభర్తలు ఆరోపిస్తున్నారు.

FOLLOW US: 

Tirupati News : తిరుప‌తి క‌లెక్టరేట్ ఆవ‌ర‌ణంలో దంప‌తులు ఆత్మహ‌త్యాయ‌త్నానికి పాల్పడ‌టం క‌ల‌క‌లం రేపింది. త‌మ భూమికి ప‌ట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా తహసీల్దార్ వేధిస్తున్నార‌ని ఆరోపిస్తూ తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట సాయిన‌గ‌ర్‌కు చెందిన భార్యభ‌ర్తలు నాగార్జున‌, భ‌వాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వీరిద్దరిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. 

అసలేం జరిగింది? 

తిరుప‌తి క‌లెక్టరేట్ ఆవ‌ర‌ణలో దంప‌తుల ఆత్మహ‌త్యాయ‌త్నం చేసుకున్నారు. సూళ్లూరుపేట సాయిన‌గ‌ర్‌కు చెందిన నాగార్జున‌, భ‌వాని దంప‌తులు సోమ‌వారం తిరుప‌తి క‌లెక్టరేట్‌లో స్పంద‌న కార్యాక్రమానికి వ‌చ్చారు. పాసు పుస్తకాల జారీలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్యక్తంచేశారు. సూళ్లూరుపేట తహసీల్దార్ చంద్రశేఖ‌ర్ త‌మ‌కు న్యాయం చేయ‌లేద‌ని క‌లెక్టరేట్ ఆవ‌ర‌ణలోనే భ‌వాని పురుగుల మందు తాకి ఆత్మహ‌త్యాయ‌త్నానికి పాల్పడింది. ప‌క్కనే ఉన్న ఆమె భ‌ర్త నాగార్జున చెయ్యి కోసుకొని ఆత్మహ‌త్యకు ప్రయ‌త్నించారు. దీంతో పోలీసులు వెంట‌నే అప్రమ‌త్తమై వీరిద్దరినీ చికిత్స కోసం తిరుప‌తి రుయా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిద్దరు రుయా ఆసుప‌త్రి అత్యవ‌స‌ర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

వైసీపీ నేత వేధింపులతో యువకుడు సూసైడ్ 

విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదాపక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి సోమేశ్వరరావు ఈనెల 8వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. రంగంలోకి దిగారు. మృదేహానికి నివాళులు అర్పించడానికి మృతుడి గ్రామానికి పయనమయ్యారు. ఆయనతో పాటు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడల్ పీలా శ్రీనివాస రావు, టీడీపీ నాయకులు ఉన్నారు. అయితే అప్పటికే గోవిందపురంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. టీడీపీ నేతలు, పక్క గ్రామాల ప్రజలు వస్తున్న విషయం తెలుసుకుని వెళ్లి మార్గ మధ్యంలోనే వారిని అడ్డుకున్నారు. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని లేకుంటే అరెస్టులు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినా టీడీపీ నాయకులు వినకుండా రోడ్డుపై బైఠాయించారు.

భూవివాదంలో సోమేశ్వర రావును వేధించారు !  

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైకాపా నాయకుల ప్రోద్భలంతో పోలీసులు, రెవిన్యూ అధికారులు ఓ భూవివాదంలో సోమేశ్వర రావును వేధించారని.. అది భరించలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని బండారు సత్య నారాయణ ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. నేతలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, స్థానిక ప్రజలకు మధ్య తోపులాట జరిగింది. అయితే సోమేశ్వర రావు చావుకు కారణం అయిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి బండారు సత్యనారయణ ఆరోపించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఏసీపీ మోహన్ రావుకు ఫిర్యాదు కాపీని అందజేశారు. 

 అంత్యక్రియలు 

అంత్యక్రియలకు సమయం మించిపోతుంది.. ఇప్పటికైనా సహకరించండంటూ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో టీడీపీ నేతలు, స్థానికులు ఆందోళనను విరమించారు. అయినప్పటికీ రంగంలోకి దిగిన డీసీపీ సుమిత్ సునీల్ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ నేతల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయకులను పోలీసు వాహనాల్లో తీసుకెళ్లి సింహాచలంలో వదిలి పెట్టారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం సోమేశ్వర రావు అంత్యక్రియలు సజావుగా సాగేలా చూసేందుకు పోలీసులు గోవిందపురానికి వెళ్లారు.  

Also Read : Rangareddy News : అనారోగ్యంతో భార్య మృతి, తట్టుకోలేక రైలుకు ఎదురెళ్లిన భర్త!

Published at : 12 Sep 2022 03:10 PM (IST) Tags: AP News Tirupati News Tirupati collectorate couple suicide attempt agriculture passbook

సంబంధిత కథనాలు

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Gujarat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, 11 మంది మృతి!

Gujarat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, 11 మంది మృతి!

Warangal News : వరంగల్ లో నకిలీ ఎన్ఐఏ అధికారుల హాల్ చల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్!

Warangal News : వరంగల్ లో నకిలీ ఎన్ఐఏ అధికారుల హాల్ చల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్!

Nizamabad News: తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని గర్భిణీని బలవంతంగా లాక్కెళ్లిన కుటుంబ సభ్యులు

Nizamabad News: తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని గర్భిణీని బలవంతంగా లాక్కెళ్లిన కుటుంబ సభ్యులు

Suryalanka Beach : బాపట్ల సూర్యలంక బీచ్ లో విషాదం, ఏడుగురు యువకులు గల్లంతు!

Suryalanka Beach : బాపట్ల సూర్యలంక బీచ్ లో విషాదం, ఏడుగురు యువకులు గల్లంతు!

టాప్ స్టోరీస్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!