Accident: ఒకే బైక్‌పై ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణం, జాతరకు వెళ్లే దారిలో ఘోరం
ఇంటి వద్ద నుంచి ఆనందంగా జాతరకు బయల్దేరారు. మరి కాసేపట్లో జాతరకు చేరుకోబోతున్నారు. కానీ ఇంతలో స్కూల్ బస్ రూపంలో మృత్యు దూసుకొచ్చింది. ముగ్గురు ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంది.
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కంటతడి పెట్టించింది. ఓ స్కూల్ బస్సు, బైక్ ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
తెర్లాం మండలంలోని టెక్కలి-వలస నేషనల్ హైవేపై మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఆటైంలో బైక్‌పై ఐదుగురు వెళ్తున్నారు. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు చిన్నారులు స్పాట్‌లోనే కన్నుమూశారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని రాజాం ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలిపల్లి పైడిమాంబ జాతరకు వీరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాద దృశ్యం చూసిన వాళ్లు కంట తడి పెట్టుకున్నారు. ఒక బైక్‌లు ఐదుగురు వెళ్లడమేంటని నిష్టూర్చారు. అందరూ కలిసి ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు.