అన్వేషించండి

Punganur: పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన - టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత

Andhrapradesh News: చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడితో గురువారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వైసీపీ ఎంపీ మిథున్ వెళ్లిన క్రమంలో ఘర్షణ జరిగింది.

Tension Situation In Punganur: చిత్తూరులో జిల్లా పుంగనూరులో (Punganuru) గురువారం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి వెళ్లగా.. టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో రెడ్డప్ప ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి. టీడీపీ కార్యకర్తలు 'మిథున్ రెడ్డి గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎంపీని గృహ నిర్బంధం చేశారు. కాగా, ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికీ పుంగనూరులో అప్పుడప్పుడూ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

గాల్లోకి కాల్పులు

పోలీసులు చెదరగొట్టడంతో కొద్దిసేపు శాంతించినా.. అనంతరం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉండడంతో టీడీపీ శ్రేణులు ఆ ఇంటిపై దాడికి దిగాయి. వాహనం ధ్వంసం కాగా.. మిథున్ రెడ్డి గన్ మెన్లు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ దాడుల్లో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని పేర్కొన్నాయి. పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

దాడిని ఖండించిన ఎంపీ

అటు, టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిదున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుందని నిలదీశారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని అన్నారు.

అటు, పల్నాడు జిల్లా వినుకొండలోనూ వైసీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే మరో వ్యక్తి నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వదిలేయమని ప్రాథేయపడినా నిందితుడు కనికరించలేదు. రషీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగిందని నిర్ధారించారు.

Also Read: YS Jagan Tweet: 'ఏపీలో రాక్షస పాలన సాగుతోంది' - వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్యపై స్పందించిన జగన్, సీఎం చంద్రబాబుకు వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget