అన్వేషించండి

Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం

Pulivendula Firing: కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం రేగింది. విగ్రహం ఏర్పాటు వివాదంలో ఇద్దరు నేతలు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది.

Pulivendula Firing: కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం రేగింది. సోమవారం అర్ధరాత్రి వినాయక విగ్రహం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. స్థానిక నేతలు పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. తనను సన్మానించలేదని పుష్పనాథ్ రెడ్డిని విజయ్ నిలదీసినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య తలెత్తిన వాగ్వాదం, ఘర్షణ రాళ్ల దాడికి దారితీసింది. ఈ గొడవలో విజయ్‌రెడ్డి, పుష్పనాథ్‌రెడ్డిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న మూడు వాహనాలను పుష్పనాథ్ రెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఇరువర్గాలను శాంతింపజేసేందుకు హజ్ కమిటీ డైరెక్టర్ భాషా రంగంలోకి దిగారు.  ఆయన అక్కడకు వెళ్లిన సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారడంతో, భాషా గన్‌మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

బీటెక్ రవి వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే

పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి సోమవారం రాత్రి ఈ వినాయక మండపాన్ని దర్శించుకున్నారు. ఆయన వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే స్థానిక టీడీపీ నేతల మధ్య వివాదం చెలరేగింది. పులివెందులలో కాల్పుల శబ్దంతో ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘర్ఘణ సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. అధికార టీడీపీ నేతలు కుమ్ములాటలకు దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి ఇంకా స్పందించలేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget