అన్వేషించండి

Siddipeta Crime: కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన కసాయి తండ్రి... సిద్ధిపేటలో అమానవీయ ఘటన

సిద్ధిపేటలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. కన్న తండ్రే బిడ్డకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు. కుటుంబ కలహాలతో బిడ్డను చంపి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని కర్కశ తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు.  భార్యతో గొడవ కారణంగా ఏడాది చిన్నారికి కన్న తండ్రి కరెంట్‌ షాక్‌ పెట్టి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన రాజశేఖర్‌, సునీత దంపతులు. వీరికి సుమారు ఏడాది వయస్సున్న పాప ప్రిన్స్‌ ఉంది. దంపతుల మధ్య ఘర్షణ రావడంతో భార్యను కొట్టి తండ్రి రాజశేఖర్‌ చిన్నారిని పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారికి కరెంట్‌ షాక్‌ పెట్టి హత్య చేశాడు. అనంతరం ఇదే తన చివరి కాల్‌ అంటూ ఓ రైతుకు ఫోన్‌ చేసి చెప్పాడు.

Also Read:  బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!

కుటుంబ కలహాలతో దారుణం

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు గొడవ పడి 11 నెలల చిన్నారిని కరెంట్ షాక్‌ పెట్టి హత మార్చిన ఘటన గ్రామస్తులను కలచివేసింది. వెంకట్రావుపేటకు చెందిన మిరుదొడ్డి రాజశేఖర్‌ దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన సునీతను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వారి కాపురం సజావుగానే సాగింది. 11 నెలల క్రితం పాప జన్మించిన తర్వాత సునీత, రాజశేఖర్‌ తరచూ ఘర్షణ పడేవారు. దీంతో ఇరు గ్రామాలకు చెందిన పెద్దలు వారికి సర్దిచెప్పి కలిసుండాలని నచ్చజెప్పారు. సునీత, అత్తమామలకు మధ్య గొడవకు దారితీసే అవకాశం ఉంటే వేరు కాపురం పెట్టాలని గ్రామ పెద్దలు సూచించారు. వేరు కాపురం పెడదామని సునీత కోరగా రాజశేఖర్ అందుకు నిరాకరించడంతో గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి గొడవ జరగడంతో భార్య సునీతను కొట్టి పాపను వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత విద్యుత్‌ షాకిచ్చి చంపేశాడు. పాప చనిపోయిన తర్వాత రాజశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: వీడియో కాల్ ఎత్తగానే నగ్నంగా కనపడ్డ యువతి.. టెంప్ట్ అయిన టెకీ, తాను కూడా.. చివరికి..

Also Read: బావ వేధింపులు తాళలేక వివాహిత సెల్ఫీ సూసైడ్... మరోచోట కానిస్టేబుల్ బెదిరింపులతో మహిళా వాలంటీర్ ఆత్మహత్య

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget