Tamil Nadu Road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం, తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
Telangana people dies in Tamil Nadu: తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు చనిపోవడంతో విషాదం చోటుచేసుకుంది.
![Tamil Nadu Road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం, తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి Telangana Mulugu people died In A Road Accident In Tamil Nadu Tamil Nadu Road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం, తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/c52857d94c79e74cf53b25b28d4bc2ab1702825520010233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana people died In Tamil Nadu Road Accident: చెన్నై/హైదరాబాద్: తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు (Ayyappa Devotees) చనిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.
తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కొందరు అయ్యప్ప భక్తులు కేరళలోని శబరిమలకు ఓ కారులో వెళ్లారు. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తరువాత తెలంగాణకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే విధి మరోలా ఉంది. తిరుగు ప్రయాణంలో పెను విషాదం చోటుసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైంది. మద్రాస్ బైపాస్ రోడ్డు సమీపంలో దిండిగల్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు సమచారం. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని స్థానికుల సహాయంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిని సుబ్బయ్య నాయుడు, సాంబయ్య, రాజుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శబరిమల దైవ దర్శనానికి వెళ్లిన వారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలియగానే వారి కుటుంబాలలో విషాదం నెలకొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)