అన్వేషించండి

Telangana Civil Aspirant: వారి కలలను నిర్లక్ష్యం చిదిమేసింది - ఢిల్లీ ఘటనలో తెలంగాణ యువతి మృతి, సీఎం సహా పలువురు నేతల దిగ్భ్రాంతి

Delhi IAS Coaching Centre: సివిల్స్ తమ బిడ్డ చిన్ననాటి కల అని ఢిల్లీ మృతుల్లో ఒకరైన తెలంగాణ యువతి సోని తండ్రి విజయ్ కుమార్ అన్నారు. నెల రోజుల క్రితమే శిక్షణలో చేరారని..ఇంతలోనే ఇలా జరిగిందని ఆవేదన చెందారు.

Tanya Soni: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగించింది. భారీ వర్షానికి రావూస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌ గ్రంథాలయంలోకి వరద చొచ్చుకుపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులను తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నవీన్ డాల్విన్ (24)గా గుర్తించారు. వీరిలో తాన్యా కుటుంబం ప్రస్తుతం తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో నివసిస్తోంది. తాన్యా కుటుంబ స్వస్థలం బీహార్‌లోని ఔరంగాబాద్ కాగా.. ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాలలోని సింగరేణి డీజీఎంగా పని చేస్తున్నారు. శ్రేయాది యూపీ కాగా, నవీన్ కేరళ నుంచి వచ్చి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు.

'మా బిడ్డ చిన్ననాటి కల'

సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి దేశానికి సేవ అందించాలనేది తమ బిడ్డ చిన్ననాటి కల అని తాన్యా సోని తండ్రి విజయ్ కుమార్ తెలిపారు. సోని మృతి పట్ల ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 'ఢిల్లీలోనే రాజనీతి శాస్త్రంలో తాన్యా బీఏ పట్టా పొందారు. నెల రోజుల కిందటే ఆమె సివిల్స్ శిక్షణలో చేరారు. మా కుటుంబం లఖ్‌నవూ వెళ్తుండగా ఈ దుర్వార్త తెలిసింది. నాగ్‌పుర్‌లో రైలు దిగి విమానంలో ఢిల్లీ చేరుకున్నాం. తాన్యా మృతదేహంతో మా స్వరాష్ట్రమైన బీహార్‌కు బయలుదేరాం.' అని విజయ్ కుమార్ ఓ జాతీయ మీడియాకు ఆవేదనతో వెల్లడించారు.

సీఎం దిగ్భ్రాంతి

ఢిల్లీలో విద్యార్థుల మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. కిషన్ రెడ్డి విద్యార్థిని సోని తండ్రికి ఫోన్ చేసి ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.

ఏడుగురు అరెస్ట్

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. అటు, ఓల్డ్ రాజేందర్ నగర్‌లో అక్రమంగా నిర్వహిస్తోన్న సుమారు 13 కోచింగ్ సెంటర్లను గుర్తించిన అధికారులు వాటిపై చర్యలు చేపట్టారు. సెల్లార్లలో అక్రమంగా నిర్వహిస్తోన్న కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు.

వీడియోలు వైరల్

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోచింగ్ సెంటర్ భవనం ముందు భారీగా వరద నీటిలో నుంచి ఓ ఫోర్ వీలర్ వాహనం దూసుకుపోగా.. నీటి అలల ధాటికి గేటు విరిగి వరద సెల్లార్‌లోకి ప్రవహించినట్లు ఆ వీడియోలో ఉంది. అలాగే, ప్రమాదానికి ముందు తీసిన మరో వీడియో సైతం వైరల్‌గా మారింది. వరద నీరు బేస్మెంట్‌లోకి ప్రవేశించడంతో లోపల ఉన్న విద్యార్థులు నీటిలో నుంచి బయటకు వస్తున్నట్లుగా అందులో ఉంది. మృతి చెందిన విద్యార్థులు బయటకు వచ్చే లోపే వరద చుట్టుముట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన స్టడీ సెంటర్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Viral News: టెస్ట్ రైడ్ అని నమ్మించి బుల్లెట్ బైక్‌తో జంప్.. ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లోనే !
టెస్ట్ రైడ్ అని నమ్మించి బుల్లెట్ బైక్‌తో జంప్.. ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లోనే !
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
Embed widget