Telangana: అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్ - బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు
చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పాత నేరస్తుడే. కానీ జైలుకు వెళ్లొచ్చినా కానీ తీరు మార్చుకోలేదు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తుడిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు శిక్ష అనుభవించి విడుదల వచ్చిన నేరస్తుడు పద్ధతి మార్చుకోలేదు. మళ్లీ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మేడ్చల్ డీసీపీ శబరిశ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు.
అనుమానాస్పందంగా తిరుగుతున్న వ్యక్తి ని అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక కు చెందిన పాత నేరస్తుడు గులాబ్ గంగారాం చౌహాన్ గా( 34 ) గా పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 9 చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన పాత నేరస్తుడు గంగారాం అని పోలీసుల విచారణలో తేలింది. ఈ మధ్యనే నగరానికి చేరుకొని బొల్లారం ప్రాంతంలో నివాసం నివాసం ఉంటున్నట్లుగా గుర్తించారు. జైలుకు వెళ్లొచ్చిన తన ప్రవృత్తి మార్చుకోలేదని పోలీసులు చెప్పారు.
పగటిపూట రెక్కీ ....
తాళాలు వేసిన ఇళ్లను పగటిపూట రెక్కీ నిర్వహించి అల్వాల్, బొల్లారం ప్రాంతాల్లో తాళలు వేసిన ఇళ్లను గుర్తించి 6 ఇళ్లను, బొల్లారం లో 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని చెప్పారు. అతని దగ్గరనుండి 27 తులాల బంగారు , 34 తులాల వెండి ఆభరణాలు 130 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17,85,000 వేల రూపాయల వరకు ఉన్నట్లు అంచనా వేశామని చెప్పారు. కేసు నమోదు చేసుకొని నిందితుని రిమాండుకు పంపినట్లు మేడ్చల్ డిసిపి శభరీష్ వెల్లడించారు.. ఈ కేసులో పాత నేరస్తుని పట్టుకున్న అల్వాల్ పోలీస్ అధికారులను అభినందిస్తూ వారికి రివార్డులను అందచేస్తున్నట్లు డిసిపి తెలిపారు.
పాత నేరస్తుడే మళ్లీ దొంగతనాలకు....
పాత ఎస్టర్డే మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. తాళాలు వేసిన ఇంటినే టార్గెట్ చేసి మరి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగటిపూట రెక్క నిర్వహించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి దొంగతనాలు చేస్తూ ఉండేవాడని వెల్లడించారు. జల్సాల పలవాటు పడి గంగారం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితున్ని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాళాలు వేసిన ఇంటిలోకి చొరబడి బంగారు ఆభరణాలు, వెండి, నగలును అపహరించే వాడని పోలీసులు వెల్లడించారు. ఇలా 27 తులల బంగారం, 34 తులాల వెండి, 1,30 వేల నగదు చోరీ చేశాడని చెప్పారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడిని రిమాండ్ కు పంపినట్లు మేడ్చల్ డీసీపీ శబరిష్ వెల్లడించారు. ఈ కేసులో పాత నేరస్తుడుని పట్టుకున్న పోలీసులను డీసీపీ శబరిష్ అభినందించి, వారికి రివార్డును అందజేశారు.