News
News
X

Tamil Nadu News: ప్రమాదంలో బాలిక మృతి, 10 రోజుల తర్వాత మృతదేహం తల మిస్సింగ్!

Tamil Nadu News: తమిళనాడులో సమాధి నుండి మృతదేహం తల మాయం అయింది. క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది.

FOLLOW US: 
 
Tamil Nadu News: తమిళనాడు చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని చిత్రవాడి గ్రామంలో ఒళ్లు గగుర్పొడితే ఘటన జరిగింది. శ్మశానంలో పూడ్చి పెట్టిన బాలిక మృతదేహం తలను కొందరు దుండగులు తీసుకెళ్లారు. 10 రోజుల క్రితం పదేళ్ల బాలిక  మృతి చెందగా.. ఆమె మృతదేహాన్ని కుటుంబ  సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. ఆమె సమాధి నుండి తలను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు పోలీసులకు అక్టోబర్ 25వ తేదీన మంగళవారం సమాచారం అందింది. ఆ విషయం అలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల మిస్సింగ్ ఘటనపై పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు.

ఆరో తరగతి చదువుతున్న కృతిక అనే బాలిక ఈనెల 5వ తేదీన ఆడుకుంటూ తీవ్రంగా గాయపడింది. ఇంటి సమీపంలోనే ఆడుకుంటుండుగా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం విరిగి ఆమెపై పడింది. తలకు, శరీరానికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. రక్తమోడుతున్న ఆ బాలికను స్థానికులు, తల్లిదండ్రులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 9 రోజుల పాటు ఆసుపత్రిలో ఆ బాలిక ప్రాణాలతో పోరాడింది. చివరకు అక్టోబర్ 14వ తేదీన ప్రాణాలు వదిలింది. 

10 రోజుల తర్వాత తల మాయం

చనిపోయిన బాలికకు ఆమె కుటుంబ సభ్యులు అక్టోబర్ 15వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. మధురాంతకం సమీపంలోని చిత్రవాడిలో ఉన్న శ్మశాన వాటికలో ఆ బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. 10 రోజుల తర్వాత స్థానికులు శ్మశానం మీదుగా వెళ్తుండగా.. ఓ సమాధిని ధ్వంసం చేసిన ఆనవాళ్లు గుర్తించారు. అక్కడే నిమ్మకాయ చెక్కలు, పసుపు, కుంకుమ, ఇతర క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే ఆ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి సమాధి ధ్వంసం కావడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

News Reels

సమాధి వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లు

శ్మశానానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి పరిస్థిత గమనించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో పోలీసులు సమాధిని తెరిచి చూశారు. అందులోని బాలిక మృతదేహానికి తల లేకపోవడాన్ని గమనించి విస్తుపోయారు. ఆ బాలిక తల్లిదండ్రులు, బంధువులు, అక్కడి పెద్ద సంఖ్యలో చేరుకున్న గ్రామస్థులు కతల లేకపోవడాన్ని చూసి వణికిపోయారు. క్షుద్ర పూజలు చేసి బాలిక తలను తీసుకెళ్లినట్లు కనిపిస్తుండటం వారిని భయాందోళనకు గురి చేస్తోంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చెంగల్ పట్టు జీఎంసీహెచ్ కు పంపిన అధికారులు, మృతదేహాన్ని పూడ్చి పెట్టిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహం తలను ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. క్షుద్రపూజలు చేసిన  బాలిక తలను తీసుకెళ్లింది ఎవరు, ఎందుకు ఈ పని చేశారు, శత్రుత్వం కారణంగా ఇలా తలను ఎత్తుకెళ్లారా, లేదా చేతబడిలో భాగమా, లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. శ్మశానం సమీపంలో చేతి గ్లౌజ్ లు, టార్చ్ లైట్ ను, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు.

Published at : 28 Oct 2022 11:47 AM (IST) Tags: Crime News Tamilnadu crime Tamilnadu head missing buried deadbody head missing

సంబంధిత కథనాలు

Nellore News : కాపీ కొట్టిందని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తారా?, స్కూల్ ముందు విద్యార్థిని తల్లి నిరసన!

Nellore News : కాపీ కొట్టిందని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తారా?, స్కూల్ ముందు విద్యార్థిని తల్లి నిరసన!

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

AP Road Accidents : కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం, లారీలు ఢీకొని ముగ్గురు సజీవదహనం!

AP Road Accidents : కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం, లారీలు ఢీకొని ముగ్గురు సజీవదహనం!

Karnataka Crime News: 'దృశ్యం-2' సినిమాను దింపేశారుగా! లవర్‌తో కలిసి భర్తను చంపేసి!

Karnataka Crime News: 'దృశ్యం-2' సినిమాను దింపేశారుగా! లవర్‌తో కలిసి భర్తను చంపేసి!

అమ్మాయిలూ 9490617444 నెంబర్‌ సేవ్ చేసుకోండి- ఆకతాయిల తాట తీయండి

అమ్మాయిలూ 9490617444 నెంబర్‌ సేవ్ చేసుకోండి- ఆకతాయిల తాట తీయండి

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam