News
News
X

Newly-Wed Couple Murder : చదువు తక్కువైందని కూతురు, అల్లుడ్ని నరికి చంపాడు - ఇది కూడా పరువు హత్యే !

కలం, మతం, హోదా పేరుతో ఇప్పటి వరకూ ప్రేమ జంటలపై పరువు హత్యలకు పాల్పడి ఉంటారు. కానీ చదువు తక్కువైందని ప్రేమ వివాహం చేసుకున్న కూతురు, అల్లుడ్ని నరికి చంపాడో వ్యక్తి.

FOLLOW US: 

Newly-Wed Couple Murder : ప్రేమ కథల్లో ఎన్నో విషాదాంతాలు ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చచ్చిపోవడమో.. హత్యకు గురవడమో జరుగుతూ ఉంటాయి. ఇాలాంటి ఘటనలకు కారణాలు చాలా ఉంటాయి. కులం, మతం, ఆస్తులు, అంతస్తులు.. ఇలా అనేక కారణాలు ఉంటాయి. అందుకే ఇలాంటి కారణాల స్టోరీలతోనే సినిమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ తమిళనాడులో  జరిగిన కొత్త దంపతుల హత్యకు కారణం మాత్రం ఎవరూ ఊహించనిది. పైగా హత్య చేసింది కూడా ఎవరో కాదు  అమ్మాయి తండ్రి. తన కుమార్తెతో పాటు అల్లుడ్ని కూడా నరికి చంపేశాడు ఆ తండ్రి. ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి ?

బీచ్‌లో సరదాగా భార్యాభర్తలు, వెనక్కి తిరిగిచూసేసరికి ఆమె మిస్సింగ్! మిస్టరీగా కేసు

తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇతర కులం యువకుడా అంటే కానే కాదు.. అదే కులానికి చెందిన యువకుడు. పోనీ బయట వ్యక్తా అంటే కాదు..దగ్గరి బంధువే. ఆస్తి పాస్తుల్లో తేడాలున్నాయా అంటే అదీ కాదు.. రెండు కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలే. మరి ఎందుకు చంపేశాడు అంటే.. చదువు కారణం. చదువుకోలేక నిరక్ష్య రాస్యుడైన కారణంగా చంపేయలేదు.. తన కుమార్తె కాలేజీ చదువు చదువుకుందని..  ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు హైస్కూల్ వరకే చదువుకున్నాడని.. ఇలా తక్కువ చదువుకున్న యువకుడు ఎక్కువ చదువుకున్న తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని కక్ష గట్టి .. పరువు తక్కువగా భావించి ఇద్దరీ హత్య చేసేశాడు .

దారి తప్పిన స్నేహం- 15 ఏళ్ల పిల్లాడితో 28 ఏళ్ల మహిళ జంప్!

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రేమికులిద్దరూ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడం లేదని బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు.  వివాహం అనంతరం తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ జంటను స్టేషన్‌కు పిలిపించారు. ఇష్ట ప్రకారం పెళ్లి చేుకున్నామని తాము మేజర్లమంటూ ఆ జంట మధురై పోలీస్‌లకు తెలిపింది. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో విచారణ జరిగిందని, వారిని ఇబ్బంది పెట్టవద్దంటూ గ్రామ పెద్దలు హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన యువతి తండ్రి వారిని నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లంగిపోయాడు. 

ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ కథ- కొడుకును ముక్కలుగా నరికి పారేసిన తండ్రి!

కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు కానీ.. ఆమె మనసును మాత్రం గుర్తించలేకపోయాడు. కానీ చదువు తక్కువ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం పరువు తక్కువగా భావించాడు. చివరికి ప్రాణం తీసి రాక్షసుడయ్యాడు.

Published at : 26 Jul 2022 05:48 PM (IST) Tags: Tamil Nadu news Crime News Murder of newly married couple father who killed daughter's son-in-law

సంబంధిత కథనాలు

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Nalgonda Crime : నల్గొండలో దారుణం, ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి

Nalgonda Crime : నల్గొండలో దారుణం, ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి

పల్నాడులో యువతి ప్రాణం తీసిన దిష్టి కొబ్బరి కాయ

పల్నాడులో యువతి ప్రాణం తీసిన దిష్టి కొబ్బరి కాయ

TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు !

TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం  - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు  !

టాప్ స్టోరీస్

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక