News
News
X

Srikakulam News : సచివాలయం ఉద్యోగితో డిప్యూటీ తహసీల్దార్ ప్రేమాయణం, పెళ్లైన విషయం దాచి మోసం!

Srikakulam News : పెళ్లి చేసుకుంటానని సచివాలయ ఉద్యోగిని మోసం చేశాడు డిప్యూటీ తహసీల్దార్. భార్యకు విడాకులు ఇచ్చేస్తానని ప్రేమికురాలిని మోసం చేశాడు.

FOLLOW US: 
Share:

Srikakulam News : ప్రేమించాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతి కూడా ఆ వ్యక్తి మాయ మాటలు నమ్మింది. తండ్రిని కూడా కోల్పోవడంతో అండగా నిలుస్తాడని భావించింది. ఇద్దరు మనసులు కలిశాయి. అయితే ఆ వ్యక్తికి ఇది వరకే పెళ్ళైన విషయం ఆ యువతికి తెలియడంతో... తనను పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పావని అతడిని నిలదీసింది. దీంతో ఆ వ్యక్తి తన భార్యకి విడాకులు ఇచ్చేస్తున్నానని నమ్మించాడు. అయితే ఆయన చూపించిన కాగితాలు వేరేవారికి చూస్తే అవన్నీ కూడా నకిలీ పేపర్లని తేలడంతో యువతి తాను మోసపోయినట్లుగా గ్రహించి అతడిని నిలదీసింది. ఇరువురు మధ్య గొడవ జరిగింది. ఈ విషయం అతడి భార్యకి తెలిసింది. ఆమె యువతికి ఫోన్ చేసి గొడవపడింది. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో భార్య రంగంలోకి దిగి యువతిపై దాడి చేసింది. దీంతో ఏంచేసేది లేక ఆ యువతి కొత్తూరు పోలీస్ స్టేషన్ లో తనను మోసం చేసిన వ్యక్తిపై, దాడి చేసిన అతడి భార్యపై కూడా ఫిర్యాదు చేసింది. తనకి న్యాయం చేయాలని కోరింది. ఆ మేరకు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

తహసీల్దార్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అయితే ఆ యువతితో కలిసి తన భర్త తనను వేధిస్తున్నాడని, విడాకులు ఇవ్వకపోతే తనను , తన పిల్లలను చంపుతామని యువతి బెదిరింపులకి పాల్పడుతున్నట్లుగా అతడి భార్య పోలీసులు ఫిర్యాదు చేసింది. దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చర్చణీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలంలోని కర్లెమ్మ గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది ఓ యువతి. కోవిడ్ కారణంగా 2019లో ఆమె తండ్రి మృతి చెందారు. ఆ తర్వాత ఆమెకి కొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న కొప్పల బాలకృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారి మధ్య స్నేహానికి దారి తీసింది. తర్వాత ఇద్దరూ పరస్పరం దగ్గరయ్యారు. డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేస్తున్న బాలకృష్ణ సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆమెను ప్రేమిస్తున్నా నని, పెళ్లిచేసుకుంటామనని నమ్మబలికాడు బాలకృష్ణ. ఈ సమయంలోనే యువతి అసలు నిజం తెలిసింది. ఇది వరకే బాలకృష్ణకి వివాహం అయిందని తెలిసిపోయింది. దీంతో ఆమె డిప్యూటీ తహసీల్దార్ ను నిలదీయగా తన భార్యకి విడాకులు ఇచ్చేస్తున్నానని ఆ పని పూర్తైన వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పి దస్త్రాలను చూపించాడు. అయితే ఆ పత్రాలు అధికారిక విడాకులకి సంబంధించినవి కావని తెలిసింది. 

ఇరువురు ఫిర్యాదులు 

ఈ విషయంపై బాలకృష్ణను యువతి నిలదీసింది. అయితే ఈ ప్రేమ బాగోతం బాలకృష్ణ భార్యకు తెలిసి ఆమె యువతిని హెచ్చరించింది. ఇలా గొడవులు జరుగుతున్న క్రమంలో ఈ నెల 26న బాలకృష్ణ ఫోన్ చేసి కొత్తూరులోని ఎన్ఎన్ కాలనీలోని తన ఇంటికి రమ్మని పిలవగా అక్కడకి వెళ్లింది యువతి. వాళ్ళిద్దరూ ఆ ఇంటిలో ఉన్న సమయంలో బాలకృష్ణ సతీమణి గీత తనపై దాడి చేయడంతో పాటు జుత్తు పట్టుకుని గోడకి కొట్టి గాయాలు పాలు చేసిందని సచివాలయం ఉద్యోగిని  పోలీసులకి ఫిర్యాదు చేసింది. డిప్యూటీ తహాసిల్దార్ బాలకృష్ణ తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని పోలీసులు దృష్టికి తీసుకువెళ్లింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తనకి న్యాయం చేయాలని యువతి పోలీసులను కోరింది. బాధిత యువతి ఫిర్యాదుతో కొత్తూరు ఎస్.ఐ గోవింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త, సచివాలయ ఉద్యోగిని కలిసి తనను వేధిస్తున్నారని బాలకృష్ణ భార్య పోలీసులు ఫిర్యాదు చేసింది. తన భర్తకి విడాకులు ఇవ్వకపోతే తనను, తన పిల్లలను చంపుతామని యువతి బెదిరింపులకి పాల్పడుతున్నట్లుగా ఆమె ఫిర్యాదులో తెలిపారు. ఈ నెల 26న కొత్తూరులోని ఎన్ఎన్ నగర్ కాలనీలో తాను తన భర్త బాలకృష్ణతో ఉంటున్న సమయంలో యువతి ఇంటిలోకి ప్రవేశించి తనను కొట్టినట్లుగా ఆమె ఫిర్యాదులో తెలిపింది. తహసీల్దార్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై  పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేస్తున్న కొప్పల బాలకృష్ణ ,సచివాలయం ఉద్యోగిని వ్యవహారం దుమారం రేపుతుంది. 

Published at : 29 Dec 2022 07:20 PM (IST) Tags: cheating Deputy tahsildar Srikakulam News Sachivalayam staff love married man

సంబంధిత కథనాలు

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

టాప్ స్టోరీస్

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్