News
News
X

Srikakulam Crime Stories: కంచికి చేరని క్రైం కథలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న దర్యాప్తులు!

Srikakulam Crime Stories: శ్రీకాకుళం పట్టణం సుపారీ గ్యాంగులకు అడ్డాగా మారుతోంది. అక్కడ జరిగే చాలా నేరాలకు సంబంధించి.. ఏళ్ల తరబడి దర్యాప్తులు కొనసాగుతూనే ఉన్నాయి. 

FOLLOW US: 
Share:

Srikakulam Crime Stories: చిన్న నగరం.. ప్రశాంతతకు నిలయమైన శ్రీకాకుళం. ఇప్పుడిప్పుడే ప్రగతి బాట వైపు అడుగులు వేస్తున్న ఈ నగరంలో నేరగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. శ్రీకాకుళంలో ముందెన్నడూ లేని రీతిలో దాడులు, హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌ల సంస్కృతి పెచ్చరిల్లుతోంది. సుపారీ గ్యాంగులు, బెట్టింగ్, గంజాయి ముఠాలు తిష్ట వేసి నగరాన్ని నేరమయం చేస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు, ఆగంతకుల కదలికలను నిరంతరం కనిపెట్టి, పట్టుకోవాల్సిన నిఘా వ్యవస్థ నిర్వహణ లోపంతో ఇలా జరుగుతున్నాయని విమర్శలున్నాయి. ఫలితంగా కేసులు పెరుగుతున్నా వాటి దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. అనేక కేసులు ఏళ్ల తరబడి విచారణలో ఉంటూ ఎప్పుడు పరిష్కారం అవుతాయో పోలీసులే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అక్రమ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు నేరాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నిఘా నిర్లక్ష్యం, దర్యాప్తుల్లో నిర్లిప్తత ఏళ్ల తరబడి పలు కేసులను కంచికి చేరని క్రైమ్ కథలుగా మార్చేస్తున్నాయి.

పారిశ్రామిక  అభివృద్ధిలో వెనుకబడినా.. 
వైద్య, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న శ్రీకాకుళం నగరంలో కొంత కాలంగా ప్రశాంతతకు విఘాతం కలుగుతోంది. రాజకీయంగా చైతన్య వంతమైన జిల్లాగా పేరొందిన ఈ జిల్లాలో.. రాజకీయ, వ్యక్తిగత, వ్యాపార కక్షలతో దాడులు, హత్యలు వంటి ఘటనలు చాలా తక్కువ. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగ, వ్యాపార, వృత్తి వ్యవహరాలపై వలస వచ్చి స్థిరపడిన వారే నగర జనాభాలో సగం మంది ఉన్నారు. వీరే ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్రైం రేట్ పెరుగుతోంది. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆరోపణలున్నాయి. 

బెట్టింగ్, పేకాట, గంజాయి, అక్రమ మద్యం ముఠాలకు నగరం అడ్డాగా మారుతోంది. ఈ తరహా అనేక ఘటనలు వెలుగు చూడటమే దీనికి నిదర్శనం. ఈ వ్యవహారాలు కొందరు పోలీస్ అధికారులకు తెలిసే జరుగుతున్నాయనని అంటున్నారు. నేరాలతో రెచ్చిపోతూ నగర ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న గ్యాంగులు నగరంలోకి చొరబడుతున్నాయని చెప్పడానికి ప్రముఖ వైద్యుడు గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్ యత్నమే తాజా ఉదాహరణ.

నీరుగారుతున్న నిఘా వ్యవస్థ..! 
సుపారీ గ్యాంగులతో హత్యాయత్నాలు చేసిన ఘటనలు నగరంలో ఇది వరకే వెలుగు చూశాయి. ఇటువంటి ముఠాలు, నేరగాళ్ల కదలికలను నిరంతరం కని పెట్టాల్సిన సీసీ కెమెరా(నిఘా నేత్రాలు) వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని పోలీసు అధికారులు ప్రకటిస్తున్నారు, కానీ నమోదైన కేసుల్లో పురోగతి కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని ప్రధాన రహదారులు, పట్టణాలు, నగరంలోని అన్ని ప్రముఖ కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద 611 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, వీటిలో ఒక శ్రీకాకుళం నగరంలోనే 110 సీసీ కెమెరాలు ఉన్నా యని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఉన్నమాట వాస్తవమే కానీ అనేక చోట్ల ఇవి పని చేయడం లేదు. సీసీ కెమెరాలన్నింటినీ అనుసంధానం చేస్తూ ఎస్పీ బంగ్లా ఆవరణలో కమాండ్ కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. 2017 నుంచి ఇది పని చేస్తున్నా నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ వ్యవస్థ గాడిలో పడినా నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. 

సుపారీ గ్యాంగులతో హత్యలు.. 
2019 ఫిబ్రవరి 7న బొందిలీపురంలో జరిగిన జంట హత్యలతో నగరం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ నేరం జరిగి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ కేసు కొలిక్కి రాలేదు. హత్య చేసిన వారు ఎవరన్నది ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానితులను గుర్తించినా, దర్యాప్తులో పురోగతి మాత్రం కనిపించడం లేదు. కేసు దర్యాప్తు కోసం ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ దర్యాప్తు సాగుతోందనే పోలీసులు చెబుతున్నారు. 
ఏడాది క్రితం జూలై 25న జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విజయాదిత్య పార్కులో సీపన్నాయుడుపేటకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి హత్యకు గురయ్యారు. ఈ కేసును ఛేదించిన ఎచ్చెర్ల పోలీసులు.. హత్య వెనుక విజయనగరానికి చెందిన సుపారీ గ్యాంగ్ ఉందని గుర్తించి వారిని, వారికి సుపారీ ఇచ్చిన మహిళను కటకటాల వెనక్కి పంపించారు. డబ్బు, అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిగ్గుతేల్చారు.

ఈ ఏడాది జనవరి 18న నగరంలోని పాత మురళీ థియేటర్ సమీపంలోని మధురా నగర్ లో గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ పై మహిళ హత్యాయత్నం చేసింది. ఆదివారం పేటకు చెందిన నిందితురాలు తనతో పాటే వచ్చిన సుపారీ బ్యాచ్ తో కాల్పులు జరిపించింది. కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితురాలిని, సుపారీ బ్యాచ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు. అక్రమ సంబంధంతో ముడిపడి ఉన్న ఈ కేసులోనూ నిందితులు డబ్బు డిమాండ్ చేసినట్టు పోలీసులు విచారణలో తేల్చారు.

గూడేన కేసులోనూ డబ్బు ప్రమేయం... 
తాజాగా ఈ నెల 11న జరిగిన డాక్టర్ గూడేన సోమేశ్వర రావు కిడ్నాప్ వ్యవహారంలోనూ డబ్బు పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. విశాఖపట్నం సుజాత నగర్ కు చెందిన వారికి సుపారీ ఇచ్చి సోమేశ్వర రావును కిడ్నాప్ చేయడానికి ప్రయ త్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో దొరికిపోయిన పరమేష్ ఇచ్చిన సమాచారంతో నగరానికి చెందిన రవితేజను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రవితేజ ఇచ్చిన సమాచారంతో చందు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చందు, రవితేజలను వేర్వేరుగా విచారించిన పోలీసులు వారి నుంచి కిడ్నాప్ యత్నానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించినట్టు తెలిసింది. పరారీలో ఉన్న మరో నిందితుడు రాజు కోసం విశాఖపట్నంలో పోలీసులు గాలిస్తున్నారు. రాజు కుటుంబాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. వారిచ్చిన సమాచారంతో రాజు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతు న్నట్టు తెలిసింది. 
రాజు పోలీసులకు చిక్కితే తప్ప కేసు ఒక కొలిక్కి రాదని చెబుతున్నారు. కాగా విచారణలో చందు, రవితేజలు ఇచ్చిన సమాచా రాన్ని పోలీసులు విశ్వసించడం లేదని తెలిసింది. డాక్టర్ సోమేశ్వర రావుతో సన్నిహితంగా ఉండే చందు ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీశారు. సోమేశ్వరరావుకు చెందిన బ్లిస్ జిమ్ ను చందు లీజుకు తీసుకొని నడిపిస్తున్నట్టు సమాచారం. అయితే ఏడాది కాలంగా అద్దె చెల్లించ కుండా డాక్టర్ను ఇబ్బంది పెట్టాడని కూడా తెలుస్తోంది. అద్దె బకాయిని పూర్తిగా ఎగ్గొట్టడానికి, ఆయన నుంచి మరికొంత మొత్తాన్ని గుంజుకోవడానికి రవితేజతో కలిసి చందు సుపారీ బ్యాచ్ తో మాట్లాడి కిడ్నాప్ ప్రయ త్నం చేశారని విచారణలో పోలీసులు గుర్తించారు. 

Published at : 16 Aug 2022 07:54 AM (IST) Tags: AP Crime news srikakulam crime news Srikakulam Crime Stories Kidnap Cases in Srikakulam Heavy Murders in Srikakulam

సంబంధిత కథనాలు

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లిలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్- నలుగుర్ని చితకబాదిన యువకుల గుంపు

హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లిలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్- నలుగుర్ని చితకబాదిన యువకుల గుంపు

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి