అన్వేషించండి

Crime News: మదనపల్లెలో దారుణం - ఆస్తి కోసం కన్న తండ్రినే కారుతో ఢీకొట్టి చంపేసిన కొడుకు

Madanapalle News: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తండ్రినే ఓ కొడుకు కారుతో ఢీకొట్టి చంపేశాడు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Father Killed By His Son in Madanapalle: ఆస్తి కోసం కన్న తండ్రినే హత్య చేశాడు ఓ వ్యక్తి. తన వాటా ఇవ్వలేదనే అక్కసుతో తండ్రిని కారుతో ఢీకొట్టి చంపేశాడు. అన్నమయ్య (Annamayya) జిల్లా మదనపల్లెలో (Madanapalle) బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి (65)కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు శంకర్ రెడ్డి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. రఘునాథరెడ్డి ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తూ రూ.16 లక్షల వరకూ అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువ కాగా.. తండ్రిని ఆస్తిలో వాటా ఇవ్వాలని అడిగాడు. గత కొంతకాలంగా ఇరువురి మధ్య ఈ వివాదం కొనసాగుతోంది.

కారుతో ఢీకొట్టి..

బుధవారం రాత్రి భోజనం అనంతరం వాకింగ్ ట్రాక్‌పై నడుస్తోన్న చిన్నరెడ్డప్పరెడ్డిని.. రఘునాథరెడ్డి నిలదీశాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. కోపంతో తండ్రిని కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బెంగుళూరులో ఉన్న సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన శంకర్ రెడ్డి స్థానికంగా ఉన్న బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో బంధువులు, పోలీసులు రాత్రంతా చిన్నరెడ్డప్ప కోసం గాలించారు. గురువారం తెల్లవారుజామున పట్టణంలోని వీవర్స్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిన్నరెడ్డప్ప మృతదేహాన్ని గుర్తించారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ యువరాజు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె సర్వజన బోధనాసుపత్రికి తరలించారు. మృతుడి చిన్న కుమారుడు శంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితున్ని అదుపులోకి తీసుకోవడం సహా కారును సీజ్ చేశారు.

Also Read: Palnadu Crime : నడిరోడ్డుపై హత్యతో వినుకొండలో 144 సెక్షన్- వ్యక్తిగత కక్షగా పోలీసుల నిర్దారణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget