అన్వేషించండి

Software Engineer Deepthi Case: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మృతి కేసు - చెల్లెలు, ఆమె బాయ్ ఫ్రెండ్ అరెస్ట్!

Software Engineer Deepthi Murder Case: జగిత్యాల జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

కోరుట్ల: జగిత్యాల జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి సోదరి చందన, ఆమె ప్రియుడిని వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా అక్క చనిపోయిన రోజే సోదరి కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అందులోనూ తెల్లవారుజామున బస్టాండులో ప్రియుడితో కనిపించడం సైతం అనుమానాలకు దారితీసింది. 

అసలేం జరిగిందంటే.. 
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బంక దీప్తి నాలుగు రోజుల కిందట తన ఇంట్లో చనిపోయి ఉంది. ఏపీకి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు 25 ఏళ్ల కిందటే కోరుట్లకు వచ్చి భీముని దుబ్బలో స్థిరపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి ఇటుక బట్టీ వ్యాపారం చేస్తూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతలుకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు 24 ఏళ్ల దీప్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కాగా, కోరుట్లలోనే ఉంటూ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తుంది. రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసింది. ఇంటి వద్దే ఉండగా, కుమారుడు బెంగళూరులో డిగ్రీ చదవుతున్నాడు.

శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు సోమవారం రోజు ఉదయం హైదరాబాద్ లోని బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. కుమారుడు బెంగళూరులో చదువుకుంటుండగా.. ఇంట్లో అక్కాచెల్లెళ్లు దీప్తి, చందన మాత్రమే ఉన్నారు. ఆరోజు రాత్రి 10 గంటల వరకు అక్కాచెల్లెళ్లతో తల్లిదండ్రులు ఫోన్ లో మాట్లాడారు. ఆలస్యమైందని, మరుసటి రోజు వస్తామని తల్లిదండ్రులు చెబితే దీప్తి, చందన సరే అన్నారు.  
మరుసటి రోజు ( మంగళవారం) ఉదయం ఓ కూతురి నెంబర్ కు శ్రీనివాస్ రెడ్డి కాల్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయడం లేదని మరో కూతురు నెంబర్ కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో వారికి అనుమానం కలిగింది. పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి ఇంట్లో చూడాలని అడిగారు. మధ్యాహ్నం ఓ మహిళ వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది, లోపలికి వెళ్లి చూడగా చిన్న కూతురు చందన కనిపించలేదు. పెద్ద కూతురు దీప్తి సోఫాలో కనిపించింది. భయంతో స్థానికులను పిలవగా వాళ్లు వచ్చి చూసి దీప్తి అప్పటికే చనిపోయి ఉందని నిర్ధారించుకున్నారు. పోలీసులతో పాటు  వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

మెట్ పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై కిరణ్ కుమార్, చిరంజీవి అక్కడికి వెళ్లి పరిశీలించారు. వంట గదిలో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు, స్నాక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి అక్కాచెల్లెళ్లు మద్యం సేవించారని అనుకున్నారు. కానీ తెల్లవారుజామున అక్క సోఫాలో చనిపోయి కనిపించగా, చెల్లెలు ఓ యువకుడితో నిజామాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాను అక్కను చంపలేదంటూ సోదరుడు సాయికి రెండో అక్క చందన వాయిస్ మెస్సేజ్ చేసినట్లు సర్క్యూలేట్ అయింది. మరోవైపు దీప్తి శరీరంపై గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దాంతో ఆమెపై దాడి చేసి హత్య చేసింది ఎవరు, ఆమె చెల్లెలు చందన అదే సమయంలో ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో చందన, ఆమె ప్రియుడితో పాటు వీరికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోరుట్లకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget