Road Accident: సిద్దిపేట జిల్లాలో విషాదం, బంధువు కోసం వెళుతుంటే బావిలోకి దూసుకెళ్లిన కారు
తమ బంధువులను కారులో ఇంటికి తీసుకురావడానికి బయలుదేరారు. అతివేగంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Road Accident in Siddipet District : తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సిరిసినగండ్ల, కొండపాక మధ్య జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం.
బంధువును ఇంటికి తీసుకొద్దామని వెళితే..
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి, ఆయన ఇద్దరు బావలు కనకయ్య, యాదగిరిలు కొండపాక స్టేజీ వద్దకు వచ్చిన తమ బంధువులను కారులో ఇంటికి తీసుకురావడానికి బయలుదేరారు. అతివేగంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి కారు దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు బావిలో పడి కారులో ఇరుక్కుపోయిన వారిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. వారిద్దరికీ గాయాలయ్యాయని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే కారులో చిక్కుకున్న సూరంపల్లికి చెందిన యాదగిరి (42) మృతిచెందాడని పోలీసులు తెలిపారు.
భారీ క్రేన్ తో సహాయక చర్యలు
కారు బావిలో పడిన సమయంలో అందులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిని ఇద్దర్ని స్థానికులు కాపాడారని, మరో వ్యక్తి చనిపోయాడని వెల్లడించారు. కారును, మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు భారీ క్రేన్ తో సహాయక చర్యలు చేపట్టారు. పాడుబడిన బావికావడం, చుట్టూ చెట్లపొదలు ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగినట్లు తెలుస్తోంది. కారును, మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించారు.
అతివేగమే కారణమా..
అతి వేగం ప్రాణాలు తీస్తుందని అధికారులు, పోలీసులు తరచుగా ప్రజలను హెచ్చరిస్తూనే ఉంటారు. తాజాగా జరిగిన ప్రమాదానికి అతివేగమే కారణం అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అసలే గ్రామాల్లో రోడ్లు కావడం, అందులోనూ చెట్లు ఎక్కువగా ఉంటాయని.. మలుపులు తిరిగే సమయంలో వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు. నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని, కనుక వాహనాలు జాగ్రత్తగా నడపాలని చెప్పారు పోలీసులు.
వివాహితపై సమీప బంధువు లైంగిక దాడి
రోజూ ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా చూపించడం లేదు. ఆడవాళ్లు అయితే చాలు వారిపై లైంగిక దాడి చేస్తున్నారు. ఇంటా బయటా ఎక్కడా ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా.. ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా.. భయపడాల్సిన దుస్థితి తలెత్తింది. ఏ కామాంధుడు ఏ రూపంలో దాడి చేస్తాడో తెలియని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఎటు నుంచి వచ్చి లైంగికంగా వేధిస్తారో కనీసం ఊహించడం కూడా కష్టంగా మారింది.
అదునుచూసి కాటేస్తున్నారు..
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అఘాయిత్యాల్లో ఎక్కువగా తెలిసిన వారే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సమీప బంధువులు, మామయ్యలు, బాబాయిలు, మరిది, బావ, వరుస అయ్యే వారు, దూరపు చుట్టాలు, ముసలీ ముతకలు, ఆఖరికి సోదరులు అయ్యే వాళ్లు కూడా అయిన వారిపైనే తమ కామాన్ని తీర్చుకుంటున్నారు. మన వాళ్లే కదా అని ఇంట్లోకి రానివ్వడం.. చుట్టాలే కదా అని నీళ్లు, ఛాయ్ ఇవ్వడమే వారి పాలిట శాపంగా మారుతోంది. ఒంటరిగా ఉన్నప్పుడు అదను చూసి మీద పడుతున్నారు. మహిళలపై మృగాళ్లుగా వ్యవహరిస్తున్నారు. అమాయకులైన మహిళలపై అరాచకం చేస్తున్నారు.