News
News
వీడియోలు ఆటలు
X

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Dial 100 Saves Life : సికింద్రాబాద్ అల్వాల్ లో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి ముందు డయల్ 100కు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు స్పందించి యువతిని కాపాడారు.

FOLLOW US: 
Share:

Dial 100 Saves Life : సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100కు డయల్ చేసి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు స్పాట్ కు చేరుకుని యువతిని రక్షించారు. చాకచక్యంగా వ్యవహరించి కానిస్టేబుల్ భాస్కర్ యువతిని రక్షించాడు. యువతి చేసిన నెంబర్ కు ఫోన్ చేయగా పిల్లల శబ్దం తప్ప సమాధానం రాకపోవడంతో పిల్లల శబ్దం ఆదారంగానే ఘటనా స్థలికి చేరుకున్నారు కానిస్టేబుల్ భాస్కర్. వెంటనే స్పందించి మూడు నిమిషాలలోపు ఘటనాస్థలికి చేరుకొని యువతిని రక్షించారు పోలీసులు. సీలింగ్ కు ఉరివేసుకొని రేష్మ(24)  ఆత్మహత్యాయత్నం చేసింది. తలుపు పగులగొట్టి యువతిని కాపాడిన కానిస్టేబుల్ భాస్కర్ ను స్థానికులు, అధికారులు అభినందించారు. నిమిషం ఆలస్యమైనా యువతి మరణించి ఉండేదని వైద్యులు తెలిపారు.  భర్తతో విభేదాలతో ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు యువతి తల్లి తెలిపారు.  

సీపీఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేసిన సీఐ 

గత కొన్ని రోజులుగా కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో  గురువారం నాడు రెండు వేర్వేరు చోట్ల సీపీఆర్ చేసి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసిన సీఐని, 108 సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు అభినందనలు అని ట్వీట్ చేశారు. 

కుకునూర్ పల్లి మండలం, చిన్న కిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడగా, హైదరాబాద్ హయత్ నగర్ లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి రాచకొండ పరిధిలోని రామన్నపేట సీఐ మానవత్వం చాటుకున్నారు అని మంత్రి హరీష్ రావు వారిని అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. #CPR అని మంత్రి హరీష్ రావు పోస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే? 

హైదరాబాద్ లోని మలక్ పేట్ కి చెందిన కావలి శ్రీనివాస్ (42), మంగమ్మ భార్యాభర్తలు. వీరికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు హయత్ నగర్ లో అద్దెకు నివాసం ఉంటున్నాడు. క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు శ్రీనివాస్. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం  సమయంలో ఓ కుటుంబాన్ని యాదగిరిగుట్టకు తీసుకెళుతున్నాడు.  ఓఆర్ఆర్ ఎగ్జిట్ దాటిన తరువాత క్యాబ్ డ్రైవర్ శ్రీనివాస్ కు ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో క్యాబ్ లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

సీఐ సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు

క్యాబ్ లో ఉన్న ప్యాసింజర్ అప్రమత్తమై స్టీరింగ్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న రామన్నపేట సిఐ మోతీరాం కారు నెమ్మదిగా వెళ్లడం గమనించారు. కారును చేరుకుని గమనించగా.. వెనుక సీట్లో ఉన్న మహిళ స్టీరింగ్ కంట్రోల్ చేస్తోంది. అప్రమత్తమైన సీఐ మరో వ్యక్తి సహాయంతోఆ కారును నియంత్రించారు. వెంటనే కారులో నుంచి డ్రైవర్ శ్రీనివాస్ ను బయటకు తీశారు. సీఐ మోతీరాం సీపీఆర్ చేయగా శ్రీనివాస్ స్పృహలోకి వచ్చాడు. చికిత్స కోసం సీఐ తన వాహనంలోనే శ్రీనివాస్ ను హయత్ నగర్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. డ్రైవర్ ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతను మృతి చెందినట్లుగా నిర్ధారించినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమై సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Published at : 31 Mar 2023 07:06 PM (IST) Tags: Secunderabad Suicide Police alwal Dail 100

సంబంధిత కథనాలు

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?