అన్వేషించండి

Hyderabad News: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్ బ్యాగు తనిఖీ చేయగా షాక్, భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. ఓ విదేశీ ప్రయాణికుడి నుంచి రూ. 67.11 లక్షలు విలువైన అమెరికన్ డాలర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad News : దేశంలోని విమానాశ్రయాలు అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా కొందరు ఎయిర్ పోర్టుల ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు. బంగారం, డ్రగ్స్, మద్యం, కరెన్సీ ఇలా అన్నింటినీ అక్రమంగా రవాణా చేస్తున్నారు. తనిఖీల్లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నా.. రకరకాల పద్ధతులలో స్మగ్లింగ్ సాగిస్తున్నారు. అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అక్రమార్కులు బంగారం, డ్రగ్స్ ను దేశంలోకి తరలిస్తున్నారు.  శంషాబాద్‌ విమానాశ్రయంలో కూడా తరచూ ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ట్రాలీ బ్యాగులోల ప్లాస్టిక్ షీట్ల కింద పెట్టి.. 
తాజాగా శంషాబాద్‌  ఎయిర్ పోర్టులో  పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  నుంచి దుబాయ్‌కు వెళ్లేందుకు ఒక ప్రయాణికుడు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు.  అతడు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అతని ప్రవర్తనపై అధికారులకు ముందే అనుమానం కలిగింది.  ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీయగా కంగారులో తడబడుతూ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతని ట్రాలీ బ్యాగ్ చెక్ చేయగా.. లోపల రూ. 67.11 లక్షలు విలువైన అమెరికన్ డాలర్లను అధికారులు గుర్తించారు. కరెన్సీని ట్రాలీ బ్యాగ్ లోపల ప్లాస్టిక్ సపోర్ట్ షీట్ల కింద తెలివిగా దాచి పెట్టినట్లు అధికారులు కనుగొన్నారు. రూ. 67.11 లక్షలు విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, కస్టమ్స్ చట్టం-1962 నిబంధనల ప్రకారం సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.  ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  విదేశీ కరెన్సీ రవాణా వెనుక ఉన్న నెట్ వర్క్ ను గుర్తించేందుకు అధికారులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.

 భారీగా బంగారం పట్టివేత
నాలుగు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది.  అబుదాబి నుంచి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద సుమారు 806 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు. సదరు నిందితుడు బంగారాన్ని పౌడర్‌గా  చేసి దానిని ఉండలుగా మార్చి ప్రైవేట్ పార్ట్‌లో  పెట్టుకుని తీసుకుని వచ్చాడు. నిందితుని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ  మార్కెట్లో దాదాపు 58.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు. 

34కిలోల బంగారం, 40కిలోల వెండి స్వాధీనం
గత నెలలో శంషాబాద్‌ ఎయిర్ పోర్టు సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి పట్టుకున్నారు పోలీసులు. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget