By: ABP Desam | Updated at : 13 Jun 2022 08:31 PM (IST)
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
Three dies in private bus overturns in Alluri Seetharamaraju District: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
ఒడిశాలోని చిన్నపల్లి నుంచి ప్రైవేటు బస్సు విజయవాడ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద అదుపు తప్పిన ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారని సమాచారం. మృతులంతా ఒడిశా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులను ధనేశ్వర్ దళపతి(24), జీతు హరిజన్(5), సునేనా హరిజన్(2), మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.
కూలీ పనులకు ఒడిశాలోని చిన్నపల్లి నుంచి ఏపీలోని విజయవాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి అతివేగం కారణమా, లేక డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం నడిపాడా అని అన్ని కోణాల్లో ఘటనకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Delivery Boy: పేషెంట్గా మారిన డెలివరీ బాయ్, డాక్టర్ను కత్తితో బెదిరించి దోపిడీ - ట్విస్ట్ ఏంటంటే!
Visakha Crime New: విశాఖ ఫిషింగ్ హార్బర్లో దారుణం, బాలుడి గొంతు కోసి సముద్రంలో పడేసిన దుండగులు
Kakinada Crime News: విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృతి, కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
Football Coach: బాలికను వేధించిన ఫుట్బాల్ కోచ్ - 2019 నాటి కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష
Ganja in AP: రెడ్హ్యాండెడ్గా దొరికిన 350 కిలోల గంజాయి - సప్లై చేసేది ఎవరో తెలిస్తే షాక్!
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
/body>