By: ABP Desam | Updated at : 24 Dec 2022 06:03 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీపీ మహేష్ భగవత్
Rachakonda Crime Report : రాచకొండ పరిధిలో 2022 సంవత్సరానికి సంబంధించిన నేర నివేదికను సీపీ మహేష్ భగవత్ శనివారం విడుదల చేశారు. రాచకొండ పరిధిలో నేరాలు పెరిగాయని ఆయన తెలిపారు. 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో 19 శాతం నేరాలు పెరిగాయని వెల్లడించారు. అయితే 29 శాతం హత్యలు, 38 శాతం కిడ్నాప్ కేసులు తగ్గాయన్నారు. గతేడాదితో పోలిస్తే 2022లో 66 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని సీపీ తెలిపారు. రహదారి ప్రమాదాలు 19 శాతం, డ్రగ్స్ కేసులు 140 శాతం పెరిగాయని స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు 17 శాతం, ఆస్తి సంబంధిత నేరాలు 23 శాతం పెరిగాయన్నారు. వీటితో పాటు అత్యాచార కేసులు 1.3 శాతం, వరకట్న హత్యలు 5 శాతం తగ్గాయని సీపీ చెప్పారు.
రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
గుట్కా రవాణా కేసులు 131 శాతం తగ్గాయని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. రహదారి ప్రమాద మరణాల్లో 0.91 శాతం, రింగ్ రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 0.31 శాతం తగ్గాయన్నారు. అయితే ఈ ఏడాది మానవ అక్రమ రవాణాలో 62 కేసులు నమోదు చేశామన్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడిన 132 మందిని అరెస్ట్ చేశామన్నారు. 3162 రోడ్డు ప్రమాదాల్లో 655 మంది మృతి చెందారని సీపీ తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల్లో 296 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. రూ.10 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు.
తగ్గిన నేరాలు
* హత్యలు 29% తగ్గాయి
* కిడ్నాప్‌లు 38% తగ్గాయి
* రేప్ కేసులు 1.33% తగ్గాయి
* వరకట్న మరణాలు 5.88% తగ్గాయి
* నేరపూరిత హత్య కేసులు 50% తగ్గాయి
* ఆత్మహత్యకు ప్రేరేపించడం 84% తగ్గింది
* మహిళల హత్య కేసులు 63% తగ్గాయి
* బలహీన వర్గాలపై నేరాలు 2% మరణాలు
* దృష్టి మళ్లింపు కేసులు 11.67% తగ్గాయి
* PITA కేసులు 3% తగ్గాయి
* 131 శాతం తగ్గిన గుట్కా కేసులు
* ప్రమాదాలలో మరణాలు 0.91% తగ్గాయి.
* ORRపై ప్రాణాంతక ప్రమాదాలు 7.69% తగ్గాయి.
* ORRలో ప్రమాదాలలో మరణాలు 31.58% తగ్గాయి
పెరిగిన నేరాలు
* చీటింగ్ కేసులు 3% పెరిగాయి
* మహిళలపై నేరాలు 17% పెరిగాయి
* ఆస్తి నేరాలు 23% పెరిగాయి
* ఆస్తి నేరాల రికవరీ రేటు 57% నుండి 63%కి పెరిగింది
* NDPS కేసుల అమలు 140% పెరిగింది
* గేమింగ్ యాక్ట్ కేసుల అమలు 17% పెరిగింది
* 66% పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు
* 19% పెరిగిన రోడ్డు ప్రమాద కేసులు
* ప్రాణాంతక ప్రమాదాలు 0.16% పెరిగాయి
* సైబర్ క్రైమ్ మోసాలు 66% పెరిగాయి
Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!
Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!
చిలుక జోస్యం కాదు- సాక్ష్యం చెప్పింది- నిందితులకు శిక్ష పడింది
Hyderabad fire accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం - వ్యక్తి సజీవదహనం
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం