జుట్టు పట్టుకుని ఈడ్చి, తలను పదేపదే నేలకు బాది - భార్యను కిరాతకంగా చంపిన భర్త
Punjab Crime News: పంజాబ్‌లో ఓ NRI భార్యను దారుణంగా హతమార్చాడు.
Punjab Crime News:
పంజాబ్‌లో దారుణం..
పంజాబ్‌లో ఓ వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ మధ్యే ఇటలీ నుంచి సొంత ఊరుకి వచ్చాడు. భార్యతో గొడవడ్డాడు. ఈ గొడవ కాస్తా దాడుల వరకూ వెళ్లింది. భార్య తలను నేలకేసి పదేపదే కొట్టాడు. ఆ దెబ్బల ధాటికి బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడి పేరు సుక్‌దేవ్ సింగ్‌గా వెల్లడించారు పోలీసులు. ఇటలీ నుంచి సందూ చతా గ్రామానికి ఈ మధ్యే వచ్చాడు నిందితుడు. అదే రోజు భార్య హర్‌ప్రీత్ కౌర్‌తో గొడవడ్డాడు. ఆమె జుట్టు పట్టుకుని తన రూమ్‌లోకి లాక్కొచ్చాడు. తలని నేలకు బలంగా కొట్టాడు. అలా పదేపదే కొట్టడం వల్ల ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన నిందితుడు మెల్లగా అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. పరారైన వ్యక్తిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
యూపీలోనూ దారుణం...
యూపీలో ఓ మహిళ తల నరికేసి వేళ్లు కత్తిరించి దారుణంగా హత్య చేశారు. బందా జిల్లాలో ఈ ఘోరం వెలుగు చూసింది. తల లేని మహిళ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఓ చేతికి నాగులు వేళ్లు కత్తిరించి ఉన్నాయి. 35-40 ఏళ్ల మధ్యలో ఆమె వయసు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. డెడ్‌బాడీకి కొంత దూరంలోనే తల దొరికింది. ఈ ఆధారాలు సేకరించి విచారణ చేపట్టిన పోలీసులు...మృతురాలి పేరు మాయాదేవిగా గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ జిల్లాకి చెందిన వ్యక్తి భార్యే ఈ మృతురాలు అని నిర్ధరించారు. వేళ్లు కత్తిరించడమే కాకుండా...ఆమె జుట్టు కూడా కత్తిరించారు. పళ్లనీ ఛిద్రం చేశారు. ప్రాథమిక విచారణలో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులనే అనుమానించారు. వెంటనే వాళ్లను పిలిపించి విచారించారు. చాలా సేపు ప్రశ్నించిన తరవాత ఈ హత్య తామే చేసినట్టు అంగీకరించారు. ఆమె భర్తతో పాటు సవితి కొడుకులు, మేనల్లుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడికి మాయా దేవి రెండో భార్య. తన కొడుకులతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానించాడు. దీనిపై అందరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో రగిలిపోయిన ఆమె భర్త, కొడుకులు చామ్రా గ్రామానికి బలవంతంగా తీసుకెళ్లారు. ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. గొడ్డలితో తల నరికారు. నాలుగు వేళ్లు కత్తిరించారు. ఈ హత్య కోసం వాళ్లు వాడిన కార్‌ని, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసుని ఛేదించారు. అందరినీ జైలుకి పంపిస్తామని వెల్లడించారు.
స్విట్జర్లాండ్‌కి చెందిన మహిళ ఢిల్లీలో దారుణ హత్యకు గురైంది. వెస్ట్ ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో ఆమె డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. మృతురాలి పేరు లీనా బెర్గర్‌గా గుర్తించారు. ఓ గవర్నమెంట్ స్కూల్ సమీపంలో మృతదేహం లభ్యమైంది. చెత్త వేసే బ్లాక్ కవర్‌లో ఆమె బాడీని కుక్కి పెట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: అమెరికాలోని ఓ జిమ్‌లో ఇండియన్‌పై దాడి, కత్తితో పొడిచిన నిందితుడు - పరిస్థితి విషమం