News
News
X

Pulivendula News : వివేకా హత్య కేసులో మరో సంచలనం, నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు!

Pulivendula News : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు వచ్చాయి. ఉమాశంకర్ రెడ్డి, స్వాతిని చంపుతామని పరమేశ్వర రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

 Pulivendula News  : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో A3 ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతికి బెదిరింపులు వచ్చాయి. పులివెందులలోని స్థానిక పాత బస్టాండు సమీపంలో  పాల వ్యాపారం చేస్తున్న ఉమాశంకర్ భార్య స్వాతిని తన ఇంటి వద్ద శనివారం మధ్యాహ్నం సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన పరమేశ్వర రెడ్డి అతని కొడుకు కొందరు వ్యక్తులు బెదిరించారని ఆమె ఆరోపించారు. తన ఇంటి వద్దకు వచ్చి తనను కొట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని, నీ భర్త వైయస్ వివేకాను ఎలా చంపాడో అలాగే నీ భర్తను కూడా చంపుతామని బెదిరించారని స్వాతి అన్నారు. పరమేశ్వర్ రెడ్డి తన మీద చెప్పుతో దాడికి యత్నించాడని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో   స్వాతి చికిత్స పొందుతుంది. 

బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు 

"నిన్న మధ్యాహ్నం పరమేశ్వర్ రెడ్డి మా ఇంటి వద్ద నాపై దాడి చేశాడు. నీ భర్త ఇంటికి వచ్చాక వివేకాను ఎలా చంపారో అలాగే చంపుతామని బెదిరించారు. నన్ను దుర్భాషలాడారు. నిన్ను కూడా చంపుతామని బెదిరించారు. నిన్ను ఇక్కడ లేకుండా చేస్తాం. కాలు చెప్పుతో నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను భయపడి ఇంట్లోకి వెళ్లి డోర్ వేసుకున్నాను. పరమేశ్వర్ రెడ్డి కొడుకు కూడా బూతులు తిట్టారు. నా సెల్ ఫోన్ లాక్కున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా పరిస్థితి ఏంటో భయంగా ఉంది. నన్ను చంపుతామని హెచ్చరించారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలి. " - ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి 

వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు 

మాజీ మంత్రి, సీఎం జగన్‌కు బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దూకుడుగా విచారణ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్​ రెడ్డి విచారణకు రావాలని  మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు గత నెలలో ఆయన్ను సీబీఐ రెండుసార్లు విచారణ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మార్చి 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లిసీబీఐ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులను అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి అందించినట్లుగా తెలుస్తోంది. భాస్కర్​ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించారు. మరోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీనే రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఉంది. నిన్న రాత్రి పులివెందులకు వెళ్లి ఆరవ తేదీనే విచారణకు రావాలని చెప్పారు.

Published at : 05 Mar 2023 06:22 PM (IST) Tags: AP News YS Viveka Murder case Police Case Pulivendula Umashankar reddy

సంబంధిత కథనాలు

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి

Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Hyderabad Crime News: భర్త ఆత్మహత్యాయత్నం, తనవల్లేనని తనువుచాలించిన ఇల్లాలు - తట్టుకోలేక తల్లి బలవన్మరణం

Hyderabad Crime News: భర్త ఆత్మహత్యాయత్నం, తనవల్లేనని తనువుచాలించిన ఇల్లాలు - తట్టుకోలేక తల్లి బలవన్మరణం

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ