By: ABP Desam | Updated at : 27 Apr 2022 03:43 PM (IST)
గుడివాడలో దాడికి గురైన ఆర్‌ఐపై రివర్స్ కేసులు
గుడివాడలో ( Gudivada ) మట్టి మాఫియా చేతిలో దాడికి గురైన రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ అరవింద్‌పై ( Attack On RI ) పోలీసులు కేసులు నమోదు చేశారు.ఆర్ఐ, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ.. తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, రెడ్ విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. దాడి ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఇలా బాధితుడైన ఆర్‌ఐపైనే ఎదురు కేసులు నమోదు చేయడం కలకలం రేపుతోంది.
ఐదు రోజుల కిందట గుడివాడ మండలం, మోటూరు ( MOturu Village ) గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి తెగబడింది. రెవెన్యూ అధికారిని జేసీబీతో తొక్కించేందుకు యత్నించింది. మాదీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరునిగా భావిస్తున్న గంటా సురేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దాడిలో సురేష్ ( Ganta Suresh ) సోదరుడు కల్యాణ్ పాల్గొన్న దృశ్యాలున్నాయి. ఆర్‌ఐపై జేసీబీతో తొక్కించేందుకు ప్రయత్నించారు. వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆర్ఐ అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం 10 మందిపై 353, 307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఒక జేసీబీ, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు.- ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గంటా సురేష్‌ను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదు.
చనిపోయిందని ఏడ్చారు కానీ మమ్మీ రిటర్న్స్ ! ఈవిడ కథలో స్టన్నింగ్ సీక్రెట్స్
ఈ లోపు మట్టి మాఫియానే ఎదురు ఫిర్యాదు చేయడంతో ఆర్‌ఐపై ( Case On RI Aravind ) కేసు నమోదు చేయడంపై ఉద్యోగుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఎలాంటి ఆధారాల్లేకుండా తమపై ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టడం ఏమిటని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసు ఉపసంహరణకు ఆర్ఐ ఆనంద్ నిరాకరించడంతోనే .. మట్టి మాఫియా ఎదురు కేసుసు పెట్టిందన్న ప్రచారం గుడివాడలో జరుగుతోంది.
Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్
DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!
Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి