Hyderabad Crime News : అమెరికా నుంచి వచ్చిన సమాచారం - హైదరాబాద్‌లో నిందితుడి వేట ! అతనేం చేశాడంటే ?
అమెరికా నుంచి వచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో ఓ ఆన్ లైన్ నేరస్తుడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Hyderabad Crime News : హైదరాబాద్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలను వాట్సప్ ద్వారా వ్యాప్తిచేస్తున్న ఫోన్ నంబరును అమెరికన్ దర్యాప్తు సంస్థ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్‌ఎస్‌ఐ) గుర్తించింది. వాటిని ఇతర గ్రూపుల్లో పోస్టు చేస్తున్నాడు. వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్న నంబరును గుర్తించి భారత్‌లోని సంబంధిత దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వాలని డీల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. రాయబార కార్యాలయం ఈ విషయాన్ని తెలంగాణ సీబీఐకి తెలియజేసింది. సీబీఐ తెలంగాణ సీఐడీకి సమాచారం చేరవేసింది
నిందితుడి దారి తప్పిన విద్యార్థి !
ఈ ఫోన్ నంబరు ఆధారంగా ఇన్‌స్పెక్టర్ బృందంతో దర్యాప్తు చేయించిన సీఐడీ నిందితుడు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంటున్నట్లు నిర్ధారించుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన యువకుడు (24) నగరంలోని రామంతాపూర్‌లో నివాసముంటూ ఎంసీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల నుంచి ఐదు వాట్సప్ గ్రూపుల ద్వారా వస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్‌లోడ్ చేసి చూస్తున్నాడు. అతడు చేసే పనిని టెక్నాలజీ ఆధారంగా అమెరికాలోని హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ గుర్తించింది. వీడియోలు షేర్ చేస్తున్న ఫోన్ నంబరును గుర్తించి.. ఇండియాలోని సంబంధిత దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వాలని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి ఓ లెటర్ రాసింది. దీంతో సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
చైల్ పోర్నోగ్రఫీ నియంత్రణకు కఠిన చట్టాలు
సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన చట్టం చాలా కఠినంగా ఉంటుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు మీ కంట పడితే.. వాటిని అస్సలు చూడొద్దు. అంతేకాదు.. దానికి సంబంధించి ఎలాంటి సెర్చింగ్ చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం. ఒకవేళ అలా సెర్చ్ చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని నియమాలు కూడా తెలుసుకోవడం తప్పనిసరి. ఈ నియమాలు తెలియక ఏదైనా తప్పు చేస్తే నేరంగా పరిగణించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏదైనా అనుచిత కార్యకలాపాలు చేస్తే.. అది నేరం పరిధిలోకి రావచ్చు. అంతేకాదు.. ఇలా చేసినందుకు జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు.
జాగ్రత్త కీలకం !
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులంతా సోషల్ మీడియాను యూజ్ చేయకుండా ఉండలేరనేది కూడా పచ్చి నిజం. యావత్ ప్రపంచాన్ని ఓకుగ్రామంగా మార్చేసింది సోషల్ మీడియా. ప్రపంచం మారుమూలన సైతం ఏం జరిగినా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అయితే, ఈ సోషల్ మీడియా వాడకం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అట్టాంటిట్టాంటి దుష్ప్రభావాలు కాదు.. తేడా కొడితే జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుంది.