Crime News: ఉద్యోగం పేరిట టోకరా.. లక్షల్లో లాస్..

సాంకేతికత వేగం పుంజుకొంటున్న కొద్దీ సైబర్‌ నేరాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఎయిర్‎పోర్ట్‎లో ఉద్యోగమని ఒకరు, హైకోర్టులో కొలువని మరొకరు.. ఇలా వేర్వేరు చోట్ల ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు టోకరా పెట్టారు.

FOLLOW US: 

Situation 1
'ఉద్యోగం రాలేదననే బాధలో ఉన్న యువతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసింది. 
హలో నేను ఏబీసీ జాబ్ వెబ్‌సైట్ నుంచి కాల్ చేస్తున్నా.. శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో మీకు ఉద్యోగం కన్ఫామ్ అయింది. మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలంటే లక్ష రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 
ఓకే, కట్టేస్తాను... కాల్ కట్ చేయగానే మనీ పంపింది. తర్వాత అవతలి వ్యక్తికి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఆఫ్...'
Situation 2
'హాయ్ లతా (పేర్లు మార్చాం), నువ్వు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నావు కదా, హైకోర్టులో పనిచేసే ఒకావిడ మొన్న పరిచయం అయింది. వాళ్ల దగ్గర ఏవో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. ఒకసారి మాట్లాడి చూడు పని అవుతుందోమో..
వెంటనే లత కాల్ కలిపింది, అవతల నుంచి ఒక మహిళ మాట్లాడుతూ.. హా అవునమ్మా, ఖాళీలైతే ఉన్నాయి. కానీ నీలానే చాలా మంది నాకు కాల్ చేశారు. ఎవరు ముందు మనీ పే చేస్తే వాళ్లకే ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పింది. 
వెంటనే లత ఆమె అడిగిన డబ్బును ట్రాన్స్ ఫర్ చేసింది. రోజులు గడుస్తున్నా ఆమె నుంచి రిప్లయ్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించింది.'దేశంలో సాంకేతికత వేగం పుంజుకొంటున్న కొద్దీ నేరాల సంఖ్య కూడా పెరుగుతోందనడానికి ఈ రెండు సంఘటనలు నిదర్శనంగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ రెండు ఘటనలు నేరాల పట్ల చర్చ జరిగేలా చేశాయి. మొదటిది హైదరాబాద్‌లో జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగం పేరుతో ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఫలానా జాబ్ వెబ్‌సైట్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పారు. మీకు శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో ఉద్యోగం కన్ఫామ్ అయిందని, దీనికి గానూ రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన యువతి డబ్బులు చెల్లించింది. డబ్బులు పంపిన తర్వాతి క్షణం నుంచి కేటుగాళ్ల నంబర్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే సిటీ సైబర్ క్రైమ్స్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


రెండో ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తాననే ఓ మహిళ అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు చేసింది. తాను హైకోర్టులో ఓ జడ్జి వద్ద పని చేస్తున్నానని.. హైకోర్టులో కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నమ్మబలికింది. డబ్బులు చెల్లిస్తే ఉద్యోగం రావడం ఖాయమని చెప్పింది. ఇలా ముగ్గురు మహిళల నుంచి రూ.1.8 లక్షలు తీసుకుంది. డబ్బులు చెల్లించాక ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్‌కు తరలించారు. 

ఎలా అరికట్టాలి?

వీరిలానే ఎంతో మంది బాధితులు ఉద్యోగం పేరుతో సొమ్ము చెల్లించి మోసపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, రైల్వే జాబ్, విదేశాల్లో కొలువులు, సాఫ్ట్ వేర్.. ఇలా ఏ రంగమైనా ఇవి జరగడం సహజంగా మారింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షాహిదా, కుత్బుల్లార్‌కు చెందిన మహిళను సైతం సైబర్ నేరగాళ్లు ఇలానే మోసం చేశారు. మరి ఇలాంటి కేటుగాళ్ల నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ నిపుణులు ఏం చెబుతున్నారు? 


  • ఉద్యోగం ఇప్పిస్తామని అపరిచిత వ్యక్తులు కాల్ చేయగానే వారి మాయమాటలు నమ్మకండి. మీకు కాల్ చేసిన నంబర్ ఎక్కడ నుంచి వస్తుంది, స్పామ్ కాల్‌గా ఉందా అనేది గమనించండి. స్పామ్ కాల్ అయితే అప్రమత్తంగా ఉండాలని అర్థం.
  • ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ప్రతిభ ఆధారంగానే భర్తీ అవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అయిన వ్యక్తి కాంట్రాక్టు జాబులు ఇప్పిస్తామని చెబితే, అదే కంపెనీలో పనిచేసే ఉద్యోగులను ఎవరినైనా సంప్రదించి క్రాస్ చెక్ చేసుకోండి. గుడ్డిగా నమ్మి మోసపోకండి.
  • సాఫ్ట్‌వేర్ సంస్థలో బ్యాక్‌డోర్ కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసి, రాత్రికి రాత్రే కంపెనీని ఎత్తేసే కన్సల్టెన్సీలు మనకు నిరంతరం వార్తల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఉద్యోగం భ్రమల్లో ఏం చేయడానికైనా వెనుకాడని అమాయకులే లక్ష్యంగా వీరు మోసాలకు తెగబడుతుంటారు. కాబట్టి ఇలాంటి వాటిని నమ్మి డబ్బులు చెల్లించకండి.
  • ఒక్కోసారి ప్రముఖ కంపెనీల నుంచి ఉద్యోగం వచ్చినట్లు మెసేజీలు, ఈమెయిల్స్ నకిలీవి పంపుతుంటారు. వాటిలో ఉండే లింకులను క్లిక్ చేస్తే ఆఫర్ లెటర్ వస్తుందని చెప్తారు. ఈ లింకుల ద్వారా మీ బ్యాంకు డిటెయిల్స్, క్రెడిట్ కార్డు నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు తస్కరించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ లింకులను క్లిక్ చేయకండి.
  • అప్రమత్తత, అవగాహనతోనే సైబర్ నేరాలను అరికట్టగలం. ఎవరైనా సైబర్ నేరాలకు గురైనప్పుడు నిర్లక్ష్యం వహించవద్దు. వెంటనే సైబర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి.  
Published at : 17 Jul 2021 11:48 AM (IST) Tags: Crime Alert Hyderabad crime Vijayawada Crime Crime Stories Cyber Crime on Job Seekers

సంబంధిత కథనాలు

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

Karimnagar News : జమ్మికుంట ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి, ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

Karimnagar News : జమ్మికుంట ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి, ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

Software Engineer Suicide: జాబ్‌లో జాయినింగ్ అని హైదరాబాద్ బయలుదేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్

Software Engineer Suicide: జాబ్‌లో జాయినింగ్ అని హైదరాబాద్ బయలుదేరిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్

Kamareddy: కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం, ఇద్దరిపై చాకుతో దాడిచేసిన దుండగుడు

Kamareddy: కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం, ఇద్దరిపై చాకుతో దాడిచేసిన దుండగుడు

టాప్ స్టోరీస్

IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్‌లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!

IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్‌లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!

Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్

Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?

Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?