అన్వేషించండి

Peddapalli Engineering Student Death: అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పురుగుల మందు తాగించి హత్య.. అసలు నిందితుడు ఆ లెక్చరరే!

Peddapalli Engineering Student Death: పెద్దపల్లి ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో లెక్చరర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెద్దపల్లి ఇంజనీరింగ్ విద్యార్థిని అక్షితారాణిని లెక్చరర్ నవీన్‌కుమార్ హత్య చేశాడు.
  • సూపర్‌వైజర్ రవికుమార్ అత్యాచారం, నవీన్ ఆమె అసూయతో హత్య.
  • పురుగుమందు తాగించి, ఆత్మహత్యగా చిత్రీకరించి, నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

Peddapalli Engineering Student Death: పెద్దపల్లి జిల్లా ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి(20) హత్య కేసు మిస్టరీ వీడింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ (మైనింగ్‌) చదువుతున్న అక్షితారాణిని ఆమె పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ జెట్టి నవీన్‌కుమార్‌ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బొగ్గుగనుల్లో శిక్షణకు వచ్చిన ఆమెపై సూపర్‌వైజర్‌ బొమ్మకంటి రవికుమార్‌ అత్యాచారం చేసినట్లు కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. హత్య, అత్యాచారం కేసుల్లో ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. 

అసలేం జరిగింది? 

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లికి చెందిన అక్షితారాణి మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్‌లో 2022లో డిప్లొమా పూర్తి చేసింది. ఆ సమయంలో వారి గ్రామానికి చెందిన జెట్టి నవీన్‌కుమార్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తుండేవాడు. వీరి ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో అక్షితారాణితో స్నేహం పెంచుకున్నాడు. భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న నవీన్‌కుమార్‌ అక్షితారాణిని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. పాలిటెక్నిక్ అనంతరం అక్షితారాణి ఉస్మానియా వర్సిటీలో బీఈ మైనింగ్‌లో చేరింది. ఆమె కుటుంబం కూడా గోదావరిఖనికి మారడంతో బొగ్గు గనుల్లో 12 రోజుల ఇంటర్న్‌షిప్‌ కోసం జనవరిలో అక్కడ చేరింది. ఆ గనిలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్‌, తాను కూడా నస్పూర్‌ పాలిటెక్నిక్‌‌లో చదివానని నవీన్‌కుమార్‌ శిష్యుడినని ఆమెను నమ్మించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. అక్షితారాణి రవికుమార్‌పై సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కమిటీ వేసి విచారణ జరిపిన యాజమాన్యం రవికుమార్‌ తప్పిదం లేదని నిర్థారించింది. ఆ తర్వాత బాధితురాలిని రవికుమార్‌ లైంగికంగా లొంగదీసుకున్నాడు. వీరి సాన్నిహిత్యాన్ని తెలుసుకున్న నవీన్‌ తట్టుకోలేకపోయాడు.

పురుగుల మందు తాగించి

అక్షితారాణిని హత్య చేయాలని నిర్ణయించుకుని సెప్టెంబర్ 12న ఆమెను కారులో ఎక్కించుకుని, బలవంతంగా పురుగుమందు తాగించాడు. అనంతరం ఆమెతో సూసైడ్‌ నోట్‌ రాయించి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అక్షితారాణి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె ఫోన్ నుంచి ఆమె తండ్రికి ఫోన్‌చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యాడు. బాధితురాలు చికిత్స పొందుతూ ఈ నెల 13న మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..సీసీ కెమెరా, బాధితురాలి కాల్‌ రికార్డులు ఆధారంగా నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. మరో నిందితుడు రవికుమార్‌ను కూడా రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.  

 

Frequently Asked Questions

పెద్దపల్లి ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి మృతికి కారణం ఏమిటి?

ఆమెను ఆమె పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్ హత్య చేశాడు. నవీన్‌కుమార్ భార్యతో విభేదాల కారణంగా అక్షితారాణిని వివాహం చేసుకుంటానని నమ్మించాడు.

ఈ కేసులో నిందితులు ఎవరు?

పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. సూపర్‌వైజర్ బొమ్మకంటి రవికుమార్ అత్యాచారం కేసులో నిందితుడు.

అక్షితారాణి హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి?

నవీన్‌కుమార్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే, అక్షితారాణి సూపర్‌వైజర్ రవికుమార్‌తో సాన్నిహిత్యం పెంచుకోవడం నవీన్ తట్టుకోలేకపోయాడు.

అక్షితారాణిని ఎలా హత్య చేశారు?

నిందితుడు నవీన్‌కుమార్ ఆమెకు బలవంతంగా పురుగుమందు తాగించి, సూసైడ్‌ నోట్‌ రాయించాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్చి పరారయ్యాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం! భద్రతపై ప్రశ్నలు
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం! భద్రతపై ప్రశ్నలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget