అన్వేషించండి

Group One News : లోకేష్‌పై విజయవాడలో కేసు నమోదు - ఎక్కువ ఎత్తు ఉన్నట్లు దొంగ పత్రాలు !

అన్ని పరీక్షల్లో పాసయ్యాడు.. కానీ ఎత్తు తక్కువగా ఉండటంతో గ్రూప్ 1 ఉద్యోగం కోల్పోయాడు. చివరికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ?


 Group One News : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ వన్ పరీక్షలకు ఎంపికయ్యాడు. అయితే ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువగా చూపేందుకు తప్పుడు పత్రాలను తెర మీదకు తెచ్చాడు. చివరికి దొరికిపోయాడు.  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 పరీక్షల్లో ఎంపికయ్యి, ఉద్యోగం కోసం ఎత్తు ఎక్కువగా ఉన్నట్లు తప్పుడు పత్రాలను సమర్పించిన ఎ. లోకేష్ అనే యువకుడి పై విజయవాడ సూర్యారావు పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు నిర్దారించారు. సాంకేతికంగా ఆధారాలను సేకరించిన పోలీసుల లోకేష్ తప్పుడు పత్రాలతో ఉద్యోగం సంపాదించాలని చేసిన ప్రయత్నంగా గుర్తించారు.

ఎత్తువ ఎక్కువ చూపిస్తే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టిన ఎ.లోకేష్ 

 అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం గుండవనపల్లి గ్రామా నికి చెందిన ఎ. లోకేష్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆద్వర్యంలో గ్రూప్-1 పరీక్షలకు ఎంపికయ్యాడు. వివిధ కేటగిరిల కింద ఉన్న మొత్తం 111 పోస్టుల కోసం కమిషన్ నోటి ఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎంపికైన అభ్య ర్థులకు ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో లోకేష్ ఎంపిక కాగా, అభ్యర్థులను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం లోకేష్ 167.7 సెంటీమీటర్లు ఎత్తు ఉన్నట్లు నిర్ధారిస్తూ పత్రాలను జారీ చేశారు. ప్రభుత్వాసుపత్రి వర్గాలు ఇచ్చిన ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను లోకేష్ అధికారులకు సమర్పించారు. అయితే లోకేష్ శరీరతత్వానికి, పత్రాల్లో ఉన్న రికార్డులకు మద్య తేడా ఉందని అధికారులకు అనుమానం కలిగింది. 

నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉన్న ఎ.లోకేష్
 
లోకేష్ సమర్పించిన సర్టిఫికెట్ లో 167.7 సెం.మీ ఎత్తు ఉన్నట్లు ఉండటంతో.. అధికారులకు అనుమానం వచ్చింది. అంత ఎత్తు ఉండడని అధికారులు సందేహం కలిగింది. ఎదో  తేడా ఉండటంతో వేర్వేరు వైద్య అధికారుల నుంచి సెకండ్ ఒపీనియన్ కోసం పంపించారు. రెండో సారి వచ్చిన ధ్రువీకరణ పత్రంలో లోకేష్ ఎత్తు 167 సెం.మీ.గా తేలింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థి 167.6 సెం.మీ. ఎత్తు ఉండాలి. నియమిత ఎత్తు కన్నా తక్కువ ఉండటంతో.. తప్పుడు ధ్రువపత్రం సమరించి ఉండొచ్చని ఏపీపీఎస్సీ అధికారులు నిర్ధారించుకున్నారు. కేసును విజయవాడ పోలీసు అధికారులకు రిఫర్ చేశారు. తూని కలు కొలతల శాఖ అధికారుల సమక్షంలో మరో సారి లోకేష్ ఎత్తు కు సంబంధించిన కొలతలు తీశారు. ఎత్తు తక్కువగా ఉన్నట్లు తేలిపోయింది. తప్పుడు ధ్రువపత్రం సమ ర్పించినట్లు నిర్ధారించి, సూర్యారావుపేట పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు లోకేష్ పై ఆంధ్రప్రదేశ్ మాల్ ప్రాక్టీసెస్ నిరోధక చట్టం 1997, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఎత్తు సర్టిఫై చేసిన డాక్టర్లపై గురి 
 
నిందితుడు లోకేష్ తానే స్వయంగా తప్పుడు పత్రాలను సృష్టించి వాటిని అధికారులకు సమర్పించాడా, లేదంటే  వైద్య సిబ్బందే ప్రలోభాలకు లొంగి తప్పుడు ధ్రువపత్రాలను ఇచ్చారా... అనే దాని పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  నిందితుడు లోకేష్ చిక్కితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.  ధ్రువపత్రంపై వైద్యుడి పేరు, సంతకం తదితర విషయాల పై ఆరా తీస్తున్నారు. ఈ మోసంలో  వైద్యుల పాత్ర ఉంటే.. వారి పైనా కేసు నమోదు చేస్తామని ఏసీపీ రవికాంత్ వెల్లడించారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Operation Kavach In Hyderabad: హైదరాబాద్‌లో నేరాల అడ్డుకట్టకు 'ఆపరేషన్ కవచ్'! 5,000 మందితో 150 ప్రాంతాల్లో తనిఖీలు!
హైదరాబాద్‌లో నేరాల అడ్డుకట్టకు 'ఆపరేషన్ కవచ్'! 5,000 మందితో 150 ప్రాంతాల్లో తనిఖీలు!
Rameswaram Road Accident: తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి
తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి
Shamshabad Airport Bomb Threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
Akhanda 2 Vs Veeramallu: అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??

వీడియోలు

India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్
Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam
Putin on oil trade with India | చమురు వాణిజ్యంపై క్లారిటీ ఇచ్చిన వ్లాదిమిర్ పుతిన్ | ABP Desam
Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Operation Kavach In Hyderabad: హైదరాబాద్‌లో నేరాల అడ్డుకట్టకు 'ఆపరేషన్ కవచ్'! 5,000 మందితో 150 ప్రాంతాల్లో తనిఖీలు!
హైదరాబాద్‌లో నేరాల అడ్డుకట్టకు 'ఆపరేషన్ కవచ్'! 5,000 మందితో 150 ప్రాంతాల్లో తనిఖీలు!
Rameswaram Road Accident: తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి
తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి
Shamshabad Airport Bomb Threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను టెన్షన్ పెడుతున్న మెయిల్స్‌
Akhanda 2 Vs Veeramallu: అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
Prabhas : బాహుబలికి రాజమౌళి లెటర్ - డార్లింగ్ ఇప్పటికే నీకు తెలిసింది కదా...
బాహుబలికి రాజమౌళి లెటర్ - డార్లింగ్ ఇప్పటికే నీకు తెలిసింది కదా...
IndiGo Flight Cancellation : ఇండిగో చేసిన తప్పు- హనీమూన్ ప్లాన్ రద్దు; ఈ జంట కష్టం మామూలుగా లేదు!
ఇండిగో చేసిన తప్పు- హనీమూన్ ప్లాన్ రద్దు; ఈ జంట కష్టం మామూలుగా లేదు!
Indigo Crisis:ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
Sasirekha Song Promo : శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో - సరికొత్తగా మెగాస్టార్, నయన్
శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో - సరికొత్తగా మెగాస్టార్, నయన్
Embed widget