అన్వేషించండి

Parvatipuram Crime News : ప్రాణానికి ప్రాణం తీర్పు చెప్పిన పంచాయతీ పెద్దలు, మతిస్థిమితం లేని వ్యక్తి దారుణ హత్య

Parvatipuram Crime News : పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. పంచాయతీ పెద్దలు ప్రాణానికి ప్రాణం అని తీర్పు ఇచ్చారు. దీనిని అమలు చేశారు కూడా. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Parvatipuram Crime News :  మా నాన్న ఎలా చనిపోయాడో మీవాడు కూడా అలానే చావాలి. లేకపోతే మీ ఇంట్లోని అందర్నీ చంపేస్తామంటూ ఒక కుటుంబం మరో కుటుంబాన్ని బెదిరించారు. ఏం చేయాలో తెలియక పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. వ్యవహారం మొత్తం విన్న పెద్దమనుషులు 'ప్రాణానికి ప్రాణమే' న్యాయమంటూ తీర్పు చెప్పేశారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించి వివరాలను పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి వెల్లడించారు.

Parvatipuram Crime News : ప్రాణానికి ప్రాణం తీర్పు చెప్పిన పంచాయతీ పెద్దలు, మతిస్థిమితం లేని వ్యక్తి దారుణ హత్య

పెళ్లిలో గొడవ 

పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం రేగులగూడలో మే 27న ఓ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో గ్రామానికి చెందిన సవర గయా(60) కుమార్తె పద్మను ఉసిరికిపాడుకు చెందిన మతిస్థిమితం లేని సవర సింగన్న(33) కర్రతో కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గయా వచ్చి సింగన్నను కిందకు తోసేశాడు. దీంతో మతి స్థిమితం లేని సింగన్న కోపంతో గయాపై కర్రతో దాడిచేశాడు. దీంతో గయా అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాతి రోజు గయా కుమారులు, స్థానికులు సింగన్న కాళ్లు, చేతులు కట్టేసి ఓ ఇంట్లో బంధించారు. అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అంతా వచ్చాక పంచాయతీ నిర్వహించి, తమ తండ్రి ఎలా చనిపోయాడో సింగన్న కూడా అలాగే చావాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందర్నీ చంపేస్తామని బెదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు పెద్దలను ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న పెద్దలు ప్రాణానికి ప్రాణం ఇవ్వాలన్న తీర్పు చెప్పారు. 

Parvatipuram Crime News : ప్రాణానికి ప్రాణం తీర్పు చెప్పిన పంచాయతీ పెద్దలు, మతిస్థిమితం లేని వ్యక్తి దారుణ హత్య

16 మందిపై కేసులు

కుటుంబంలో అందరి ప్రాణాలు తీస్తారని భయపడిన సింగన్న కుటుంబసభ్యులు పెద్దలు చెప్పిన తీర్పు అమలుకు అంగీకరించారు. ఈ నెల 28న సింగన్నకు విషమిచ్చారు. మరణించలేదని ఉరేశారు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని కాల్చేశారు. గయా, సింగన్న మరణాలు సాధారణమైనవని మొదట భావించినా గ్రామంలోని రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా సమాచారం తెలుసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశారు. పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లో మిస్టరీని ఛేదించిన పోలీసులు హత్యలకు  ప్రేరేపించినవారు, పంచాయతీ నిర్వహించిన పెద్దలు సహా ఇలా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశారు. పాలకొండ సీఐ జి.శంకరరావు, దోనుబాయి, బత్తిలి, పాలకొండ ఎస్సైలు కిశోర్‌వర్మ, డి.అనిల్‌కుమార్‌, ప్రసాద్‌ ఆయా ప్రాంతాలకు వెళ్లి వివరాలు సేకరించారు. రెండూ హత్యలుగా తేలినట్లు పేర్కాన్నారు. హత్యలకు కారకులు, ప్రేరేపించినవారు, పంచాయతీ నిర్వహించిన పెద్దలు ఇలా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Space Science Secretes: ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Embed widget