News
News
X

Parvathipuram News : తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి, స్మశానంలోకి లాక్కెళ్లి దారుణం!

Parvathipuram News : పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై వివాహితుడు లైంగిక దాడి చేశాడు.

FOLLOW US: 
Share:

Parvathipuram News : ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడ్డాడు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపిన వివరాలు మేరకు... ఆదివారం రాత్రి వీరఘట్టం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బహిర్భూమికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన గౌరునాయుడు (48) అనే వ్యక్తి బాలిక రాకను గమనించి మాటు వేశాడు. చిన్నారిని బలవంతంగా పట్టుకుని దూరంగా ఉన్న స్మశానంలోకి తీసుకెళ్లారు. చిన్నారి అరవకుండా బలవంతంగా నోరు మూశాడు. ఆ తర్వాత చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అటువైపు స్థానికులు రావడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారిని గమనించి స్థానికులు అక్కడి చేరుకుని ఆమె ఆరా తీయగా జరిగిన ఘటన చెప్పింది. అప్పటికే నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలించిన స్థానికులు... అతడ్ని పక్క గ్రామంలో పట్టుకున్నాడు. అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.  నిందితుడి గౌరు నాయుడు మీద పోక్సో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.  

దెయ్యాన్ని వదిలిస్తానని నమ్మించి అత్యాచారం

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో  45 ఏళ్ల అశోక్ కుమార్‌  దెయ్యాన్ని వదిలిస్తాననే సాకుతో బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ బాలిక మూడేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు నయం కాకపోవడంతో...అశోక్ అనే వ్యక్తి బాలికకు దెయ్య పట్టిందని బాలిక కుటుంబాన్ని నమ్మించాడు. దెయ్యం వదిలించడం తనకు తెలుసని నమ్మంచి కొన్ని రోజులు బాలిక ఇంటికి వచ్చివెళ్తుండేవాడు. ఈ క్రమంలో బాలిక ఇంటికి వచ్చిన అశోక్ ... దెయ్యాన్ని వదిలిస్తాను బాలికను తనతో పంపించాల్సిందిగా తల్లిని ఒప్పించాడు. ఆ తర్వాత బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి తిరిగొచ్చిన బాలిక తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు అశోక్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

ప్రియురాలిపై స్నేహితులతో కలిసి అత్యాచారం 

 తమిళనాడులో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై ఆమె ప్రియుడు, స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డాడు. తమిళనాడు తిరువళ్లూరు సమీపంలోని ఇద్దరు చిన్నారులతో తల్లి నివాసం ఉంటుంది. ఆమెపై ప్రియుడు, తన ఇద్దరు స్నేహితులు కలిసి ఆదివారం అత్యాచారం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.   వివాహిత ప్రియుడు విజయకుమార్‌, ఆటో డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. వయసులో తన కంటే ఆరేళ్ల చిన్నవాడైన విజయకుమార్ తో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది.    విజయ్‌కుమార్‌తో ఆమె ఆరు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.  తన భర్తతో గొడవల కారణంగా విడిపోవాలనే ఆలోచనలో ఆమె ఉందని పోలీసులు తెలిపారు. చీర కొనిస్తానని ఆమెను నమ్మించిన విజయకుమార్ ప్రియురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తన స్నేహితులను పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు విజయకుమార్.   ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

Published at : 03 Jan 2023 09:10 PM (IST) Tags: Crime News Burial Ground abused Minor Girl Parvathipuram

సంబంధిత కథనాలు

నెల్లూరు పోలీసులకు షాకిచ్చిన దొంగ- వాగులోకి దూకి పరారీ

నెల్లూరు పోలీసులకు షాకిచ్చిన దొంగ- వాగులోకి దూకి పరారీ

Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా

Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా

Hyderabad Crime: చైన్ స్నాచింగ్స్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్, చోరీలకు కారణం ఏంటంటే !

Hyderabad Crime: చైన్ స్నాచింగ్స్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్, చోరీలకు కారణం ఏంటంటే !

Kotamreddy Vs Corporator : నెల్లూరు రూరల్ లో వార్ స్టార్ట్, కోటంరెడ్డి బెదిరిస్తున్నారని కార్పొరేటర్ ఫిర్యాదు

Kotamreddy Vs Corporator : నెల్లూరు రూరల్ లో వార్ స్టార్ట్, కోటంరెడ్డి బెదిరిస్తున్నారని కార్పొరేటర్ ఫిర్యాదు

Kadapa Crime : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్, బ్యాంక్ అకౌంట్లలో కోటికి పైగా నగదు చోరీ

Kadapa Crime : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్, బ్యాంక్ అకౌంట్లలో కోటికి పైగా నగదు చోరీ

టాప్ స్టోరీస్

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Demand For TDP Tickets :  టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

SBI Q3 Result: రికార్డ్‌ సృష్టించిన స్టేట్‌ బ్యాంక్‌, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు

SBI Q3 Result: రికార్డ్‌ సృష్టించిన స్టేట్‌ బ్యాంక్‌, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు