Guntur News: కన్న కొడుకుని చంపి, గుట్టుగా పాతేసిన తల్లిదండ్రులు - ఎందుకో తెలిసి గ్రామస్థులు షాక్!
Palnadu Murder: ఊళ్లో కుటుంబం పరువు తీస్తున్నాడనే కోపంతో గత మూడు రోజుల క్రితం కోపంతో తల్లిదండ్రులు కొట్టడంతో వెండి గోపి అక్కడక్కడే చనిపోయాడు. దీంతో శవాన్ని మూటగట్టి పొలంలో పాతి పెట్టారు.
Murder In Palnadu District: మాచెర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో ఘోరమైన ఘటన జరిగింది. కొడుకు వేధింపులు భరించలేక అతణ్ని తల్లిదండ్రులే హత్య చేశారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కుమారుడు తరచూ డబ్బుల కోసం వేధిస్తున్నాడని, అందుకే ఆ పని చేసినట్లుగా స్థానికులు కూడా చెప్పారు. హత్య అనంతరం గుట్టు చప్పుడు కాకుండా తల్లిదండ్రులు, కొడుకు శవాన్ని పొలంలో మూట కట్టి పూడ్చి పెట్టేందుకు సన్నాహాలు చేశారు. ఆ నోటా ఈ నోటా గ్రామస్తులు మాట్లాడుకుంటూ ఉండడంతో ఆ విషయం కాస్త పోలీసులకు తెలిసింది. దీంతో వారు రంగప్రవేశం చేసి, తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ ఘటన గత మూడు రోజుల క్రితం అర్ధరాత్రి జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు కన్న కొడుకుని చంపడంతో ఊరిలో జనం అవాక్కయ్యారు.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెండి శ్రీను, రమణమ్మల కొడుకు వెండి గోపి (20) జులాయిగా తిరుగుతూ కనిపించిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తూ ఉంటున్నాడు. ఊళ్లో కుటుంబం పరువు తీస్తున్నాడనే కోపంతో గత మూడు రోజుల క్రితం కోపంతో తల్లిదండ్రులు కొట్టడంతో వెండి గోపి అక్కడక్కడే చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు కొడుకు శవాన్ని మూటగట్టి ఆటో డ్రైవర్ సహాయంతో తీసుకెళ్లి పొలంలో పాతి పెట్టారు. మూడు రోజుల తర్వాత విషయం బయటకు పొక్కడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పాతిపెట్టిన వెండి గోపి శవాన్ని బయటికి తీశారు. దీనిపై సాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.