News
News
X

Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ

Palnadu News : పల్నాడు జిల్లాలో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి కానిస్టేబుల్ మోసం చేశాడు. ఎంగేజ్మెంట్ చేసుకుని రూ. 5 లక్షలు కూడా తీసుకున్నాడని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

FOLLOW US: 

Palnadu News : పల్నాడు జిల్లా నరసరావుపేటలో కానిస్టేబుల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్ మోసం చేశాడు. బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీని స్పందనలో కోరింది. సోషల్ మీడియాలో పరిచయమై కానిస్టేబుల్ పెళ్లి చేసుకుంటానని ఐదు లక్షల కట్నం తీసుకొని మోసం చేశాడని యువతి ఆరోపిస్తుంది. సోమవారం స్పందనలో ఎస్పీకి యువతి ఫిర్యాదు చేసింది. గుంటూరుకు చెందిన రాజేష్ అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన యువతితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంగేజ్మెంట్ చేసుకుని రూ.5 లక్షలు నగదు తీసుకొని ఇప్పుడు మొహం చాటేశాడని యువతి ఫిర్యాదులో తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకుంది.  

అసలేం జరిగింది? 

'గుంటూరు చెందిన రాజేష్ అనే వ్యక్తి సోషల్ మీడియో పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఎంగేజ్మెంట్ చేసుకుని రూ.5 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోలేను అని మాట దాటేస్తున్నాడు. స్పందనలో ఫిర్యాదు చేసేందుకు వస్తే కంప్లైంట్ వద్దని మాట్లాడుకుందామని చెప్పాడు. నమ్మి వాళ్లింటికి వెళ్లాను. అక్కడ నుంచి అతడు పారిపోయాడు. వాళ్ల నాన్న మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. సస్పండ్ చేస్తారు అంతే కాదా? అంటున్నారు. పెళ్లి మాత్రం చేయనని రాజేష్ తండ్రి అంటున్నారు. రాజేష్ పెళ్లి చేసేశామని చెబుతున్నారు.'  - బాధితురాలు 

ఏడేళ్ల క్రితం పరిచయం 

'సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. ఏడేళ్ల క్రితం మాకు పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని వాళ్ల అమ్మ నాన్నలను మా ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ల మేనమామ కూడా వచ్చాడు. మా అమ్మ నాన్నలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. నాకు పరిచయం అయినప్పుడు బీటెక్ చేస్తున్నాడు. ఇప్పుడు నరసరావుపేటలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. కానీ అది ఎంతవరకూ నిజమో తెలియదు. పది హేను రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంతకు ముందు మాట్లాడాడు. ' -బాధిత యువతి 

ప్రియుడి గొంతు కోసిన యువతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది ఓ మహిళ. ఆ తర్వాత మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి తరలిస్తూ పోలీసులకు చిక్కింది. అనంతరం.. ఆ మృతదేహాన్ని పడేసేందుకు సూట్​కేస్​లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని సంభల్​ ప్రాంతానికి చెందిన ఫిరోజ్​గా గుర్తించారు. 

ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ భర్తను విడిచిపెట్టి నాలుగేళ్లుగా ఫిరోజ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని ఫిరోజ్‌ను కోరగా అందుకు అతను నిరాకరించాడు. తర్వాత కూడా పదేపదే ఫిరోజ్‌పై సదరు మహిళ ఒత్తిడి తెచ్చింది. అతను ఒప్పుకోక పోవడంతో కక్ష పెంచుకుని పక్కా ప్లాన్ ప్రకారం అతడ్ని హతమార్చింది. రేజర్​తో ఫిరోజ్ గొంతు కోసి చంపింది నిందితురాలు. ఆ తర్వాత మృతదేహాన్ని పడేసేందుకు పెద్ద సూట్​కేసు కొనుగోలు చేసింది. సూట్​కేసులో మృతదేహాన్ని పెట్టి కారులో తరలిస్తుండగా పోలీసులకు చిక్కింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Minister Roja Vs Janasena : మంత్రి రోజా, జనసేన మధ్య వార్- ఎవరూ తగ్గట్లేదు!

Published at : 08 Aug 2022 08:35 PM (IST) Tags: social media AP News Crime News Palnadu news constable cheats marriage promise

సంబంధిత కథనాలు

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

పుకార్లు నమ్మొద్దు -మతిస్తిమితం లేకే విగ్రహాల విధ్వంసం: హైదరాబాద్‌ పోలీసులు

పుకార్లు నమ్మొద్దు -మతిస్తిమితం లేకే విగ్రహాల విధ్వంసం: హైదరాబాద్‌ పోలీసులు

అడవిలో చెట్టుకు గర్భిణి మృతదేహం-నెల్లూరులో భయం భయం- పోలీసుల్లో కొత్త టెన్షన్

అడవిలో చెట్టుకు గర్భిణి మృతదేహం-నెల్లూరులో భయం భయం- పోలీసుల్లో కొత్త టెన్షన్

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

టాప్ స్టోరీస్

Delhi Liquor Scam Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ తొలి అరెస్ట్ - నెక్ట్స్ ఈడీ కూడా !?

Delhi Liquor Scam Arrest :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ తొలి అరెస్ట్ - నెక్ట్స్ ఈడీ కూడా !?

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్