Minister Roja Vs Janasena : మంత్రి రోజా, జనసేన మధ్య వార్- ఎవరూ తగ్గట్లేదు!
Minister Roja Vs Janasena : మంత్రి ఆర్కే రోజా కారు ఇష్యూ మరింత ముదిరింది. జనసేన నేతలు పిల్ల వె**లని మంత్రి రోజా కామెంట్స్ చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Minister Roja Vs Janasena : ఏపీ మంత్రి ఆర్కే రోజా కారు వివాదం ముదురుతోంది. జనసేన నాయకులు, మంత్రి రోజా మధ్య కారు వార్ నడుస్తోంది. రోజా అక్రమార్జనతో కారు కొన్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కామెంట్స్ కు రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసైనికులు పిల్ల వె**లు అనే వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన నేతలు పిల్ల వె**లు అయితే వైసీపీ నాయకులు పెద్ద వె**లా అని మండిపడ్డారు.
రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్
మంత్రి రోజా తమకు తక్షణమే క్షమాపణ చెప్పాలని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడారు. రోజా 150 సినిమాల రెమ్యునరేషన్ పవన్ కల్యాణ్ మొదటి రోజు మొదటి షో ఆదాయంతో సమానమన్నారు. రోజా జనసేన కాన్వాయ్ లపై విమర్శించినప్పుడూ ఏమైందని ప్రశ్నించారు. మేము పిల్ల వె**లమైతే, మీరు పెద్ద వె**లా అంటూ విమర్శించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంపై ఆదివారం మంత్రి రోజా, మంత్రి పెద్దిరెడ్డి తమ జనసైనికులను పిల్ల వె**లని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మంత్రి రోజా జనసైనికులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రోజా గుట్టురట్టు చేస్తామని హెచ్చరించారు.
బెంజ్ కారు అక్రమార్జనే
సినిమాల్లో ఐరన్ లెగ్ అని రోజాను పక్కన పెట్టారన్నారని, జబర్దస్త్ లో కూడా అవకాశాలు లేవని జనసేన నేతలు ఆరోపించారు. అలాంటప్పుడు రోజా కొన్న బెంజ్ కారు అక్రమ ఆర్జనేనని ఆరోపించారు. టూరిజం శాఖ మంత్రిగా తిరుమలకు మాత్రమే పరిమితం అయిన రోజాకు సక్రమార్జన ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ మొదటి రోజు మొదటి షో కలెక్షన్ రోజా 150 చిత్రాల కలెక్షన్ కి సమానమని జనసేన నాయకులు అన్నారు. జన సైనికులను విమర్శిస్తే చిత్తూరు జిల్లాలో, తిరుపతిలో రోజాను తిరిగనివ్వమన్నారు.
మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్
సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్రచారాన్ని ఏపీ మంత్రి రోజా ఖండించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకూ సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతూనే ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ సాగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షం, జనసేన నాయకులే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇటీవల మంత్రి ఆర్.కె.రోజా కొత్త కారుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.లంచాలు తీసుకుని కారు కొన్నారని ప్రచారం జరుగుతోంది.
చిన్న చిన్న యాంకర్లు కార్లు కొంటున్నారు-రోజా
మంత్రి ఆర్.కె.రోజా వైసీపీ ప్రభుత్వం, నాయకులపై జరుగుతున్న ప్రచారం కేవలం ప్రతిపక్షనేతలు, జనసేన నేతలు చేస్తున్న కుట్ర అని కొట్టిపడేశారు. రాజీనామా చేయాల్సి వస్తే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ లు వందల సార్లు రాజీనామా చేయాల్సి వచ్చేదన్నారు. టీడీపీ హయాంలో పిచ్చోళ్ళు, పండు ముసళ్ళు అని చూడకుండా రేప్ చేసిన దాఖలాలు అనేకం చూసామన్నారు. టీడీపీకి చెందిన నేతల కాలేజీలో ఎంత మంది ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయో అందరూ కళ్లారా చూశామన్నారు. చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొంటున్నారని, జనసేన పిల్ల వె**లు, టీడీపీ ఉన్మాదులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను లంచాలు తీసుకుని కారు కొన్నట్టుగా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను 150 సినిమాలు చేశానని, ఎన్ని లక్షల రూపాయలు జబర్దస్త్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నానో తన అకౌంట్ చూస్తే అర్థం అవుతుందన్నారు.