By: ABP Desam | Updated at : 05 Aug 2022 07:40 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
Palnadu News : మాచర్ల రూరల్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగమల్లేశ్వరి(24) ఆత్మహత్యాయత్నం చేశారు. గురువారం కంభంపాడు గ్రామ సమీపంలోని నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద యాసిడ్ తగినట్లు సమాచారం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగమల్లేశ్వరిని స్థానికులు గమనించి మాచర్ల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్ఐ ఆదిలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరిని మాచర్ల ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.
మహిళా కానిస్టేబుల్ కు లైంగిక వేధింపులు
సామాన్యులకు సమస్య వస్తే పోలీసు స్టేషన్ కు పరిగెడతారు. మరి పోలీసుకే సమస్య వస్తే ఏం చేస్తారు. లెక్క ప్రకారం వారు కూడా పోలీసు స్టేషన్ కే వెళ్లాలి. అక్కడ సాధారణ వ్యక్తుల్లాగే ఫిర్యాదు చేయాలి. అసలు సమస్య ఏమిటో చెప్పాలి. కానీ పోలీసు స్టేషన్ లో న్యాయం జరగదని తెలిస్తే ఏంచేస్తారు. సాధారణ వ్యక్తుల్లాగే వాళ్లు కూడా రోడ్డు ఎక్కాల్సిందే. నడి రోడ్డుపై బైఠాయించి న్యాయం కావాలంటూ ఆందోళన చేయాల్సిందే. అదే జరిగింది పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం యల్లమందలో. షేక్ హసీనా మహిళా పోలీసు కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావు అనే వ్యక్తులు మద్యం తాగి షేక్ హసీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మహిళా పోలీసు అని కూడా చూడకుండా మద్యం మత్తులో వేధించారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..
తనపై ఇద్దరు వ్యక్తులు వేధింపులకు దిగడంతో మహిళా పోలీసు షేక్ హసీనా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యల్లమంద గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావులు తనను వేధించారని, అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు షేక్ హసీనా. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరూ మరింతగా రెచ్చిపోయారు. మా పైనే కంప్లైంట్ ఇస్తావా అంటూ మరోసారి వేధింపులకు దిగారు. మద్యం సేవించి మత్తులో తూగుతూ వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించారు. మాటలతో మహిళా పోలీసు షేక్ హసీనాను వేధించారు. తర్వాత చేతలతోనూ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. తాను ఓ మహిళా పోలీసు అని తెలిసినా వేధింపులకు దిగడంపై హసీనా ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని వాపోయారు.
సచివాలయం ఎదుట ధర్నా
పోలీసునే వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, కంప్లైంట్ చేస్తే వారి వేధింపులు మరింత పెరగడంతో మహిళా పోలీసు షేక్ హసీనా రోడ్డుపై బైఠాయించారు. కుటుంబ సభ్యులతో కలిసి నడి రోడ్డుపై కూర్చుని ధర్నా చేశారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తనను వేధించిన యల్లమంద గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావులను శిక్షించాలని కోరారు. తన చెల్లి షేక్ హసీనాపై వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని బాధిత మహిళ సోదరుడు డిమాండ్ చేశారు. స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావులకు కొందరు సచివాలయ సిబ్బంది మద్దతు ఇస్తున్నారని షేక్ హసీనా సోదరుడు ఆరోపించారు.
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం
UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్లోనే ఘటన
Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్స్టర్లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి
Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
/body>