(Source: ECI/ABP News/ABP Majha)
Palnadu Doctor Missing: పల్నాడు జిల్లాలో ఫేమస్ డాక్టర్ మిస్సింగ్ కలకలం, గతంలోనే ఇలాగే !
Doctor missing in NarasaraoPeta: పూజిత హాస్పటల్ అధినేత డాక్టర్ వెంకట సుబ్బారావు కనిపోయించడం లేదంటూ అతని భార్య సృజనాకుమారి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Palnadu District Doctor Venkata Subbarao missing in NarasaraoPeta:
నరసరావుపేటలో ప్రముఖ ప్రయివేటు వైద్యుడు అదృశ్యమయ్యాడు. ఈ నెల 4వ తేదీ నుంచి పట్టణంలోని పూజిత హాస్పటల్ అధినేత డాక్టర్ వెంకట సుబ్బారావు కనిపోయించడం లేదంటూ అతని భార్య సృజనాకుమారి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు పట్టణం లోని పూజిత హాస్పిటల్ అధినేత ముండ్రు వెంకట సుబ్బారావు అనే వైద్యుడు ఈ నెల 4వ తేదీ నుండి కనిపించడం లేదని ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
వైద్యుడు సుబ్బారావు స్నేహితులు మురళి, శ్రీనివాసరావు, సంజీవ రెడ్డి, బాలకృష్ణలతో కలిసి వ్యాపారం చేసి రూ.2కోట్లు నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా గతంలో వైద్యుడు వెంకట సుబ్బారావు 40 రోజుల పాటు అదృశ్యమై గుంటూరు లోని ప్రయివేటు హోటల్లో దొరికాడని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. డాక్టర్ మిస్సింగ్ ఘటన నరసరావుపేటలో హాట్ టాపిక్ గా మారింది.
పోలీసులు ఏమన్నారంటే..
నగరంలోని పూజిత హాస్పిటల్ డాక్టర్ వెంకట సుబ్బారావు మిస్సింగ్ అయినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ నెల 4న అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదని ఆయన భార్య సృజనా కుమారి కేసు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. డాక్టర్ మిస్సింగ్ కావడం ఇది తొలిసారి కాదని, గతంలో ఓసారి కనిపించకుండా పోయి 40 రోజుల తరువాత జనవరి 19వ తేదీన తిరిగొచ్చారు.
డాక్టర్ తో పాటు ఆయన ఫ్రెండ్స్ మురళీ, హైదరాబాద్ కు చెందిన బాలక్రిష్ణ, సంజీవరెడ్డి, సత్యనారాయణ, గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు మరికొందరితో కలిసి రైస్ పుల్లింగ్ బిజినెస్ చేశారు. ఈ క్రమంలో రూ.2 కోటల్ మేరకు అప్పుల పాలయ్యారని, దీనిపై రాత్రి పూట తన భర్త వెంకట సుబ్బారావు కుమిలిపోయేవారని సృజనాకుమారి తెలిపినట్లు ఎస్సై వివరించారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. డాక్టర్ ఆచూకీ కోసం అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టినట్లు తెలిపారు. మిస్సింగ్ అయిన డాక్టర్ స్నేహితులను విచారణకు పిలిచినట్లు చెప్పారు.