Palnadu News : చావులోనూ వీడని బంధం, గంటల వ్యవధిలో భార్యభర్తలు మృతి
Palnadu News : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణించిన గంటల వ్యవధిలోనే భార్య మృతి చెందింది.
![Palnadu News : చావులోనూ వీడని బంధం, గంటల వ్యవధిలో భార్యభర్తలు మృతి Palnadu district chilakaluripet husband wife died in hours difference dnn Palnadu News : చావులోనూ వీడని బంధం, గంటల వ్యవధిలో భార్యభర్తలు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/721f73493d2a45101333a16a69e12ea11658150107_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Palnadu News : భర్త మరణించిన కొన్ని గంటల్లోనే భార్య మృతి చెందిన విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. నాదెండ్ల మండలం గణపవరం అంబేడ్కర్ కాలనీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన తాళ్లూరి అచ్చయ్య (60) చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ గ్యారేజీలో వాటర్ సర్వీసింగ్ పనిచేస్తుంటాడు. సోమవారం తెల్లవారుజామున అతను మృతి చెందాడు. భర్త అచ్చయ్య మృతితో అతని భార్య చిట్టెమ్మ(55) తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త మృతి చెందిన గంటల వ్వవధిలోనే ఆమె కూడా కన్నుమూసింది. చిట్టెమ్మ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో భర్త మృతి చెందిన గంటల వ్యవధిలో చిట్టెమ్మ మృతి చెందటంతో కాలనీలో విషాదం అలముకుంది. మృతులకు ముగ్గురు కుమార్తెలు. ఈ ఘటన స్థానికులు ప్రతి ఒక్కరిని కదిలించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)